Telugu News

సిఎం కేసీఅర్, మంత్రి పువ్వాడ కు క్షీరాభిషేకం.

మున్నేరుకు ఆర్సీసీ వాల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం

0

సిఎం కేసీఅర్, మంత్రి పువ్వాడ కు క్షీరాభిషేకం.

== మున్నేరుకు ఆర్సీసీ వాల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం మున్నేరు వరద ఉదృతి శాశ్వత పరిష్కారం చూపించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి మేరకు ఖమ్మం మున్నేరు కు ఇరు వైపులా ఆర్సీసీ వాల్ నిర్మాణ కోసం సిఎం కేసీఅర్ గారు రూ.690 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా ఖమ్మం త్రీ టౌన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాల్వొడ్డు మున్నేరు బ్రిడ్జి వద్ద సీఎం కేసీఆర్ కి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. మున్నేరు ఘటనను స్వయంగా చూసి చలించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  విజ్ఞప్తి మేరకు మున్నేరు కు ఇరు వైపులా ఆర్.సి.సి వాల్ నిర్మాణ కోసం ప్రభుత్వం రూ.690 కోట్ల రూపాయిల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేయటం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

allso read – తైతక్కలు ఆడితే ప్రజలు నమ్ముతారా..?: మంత్రి

దీనితో పాటు త్రీ టౌన్ ను అద్భుతంగా అభివృద్ది చేసి రూ.180 కోట్లతో మున్నేరు పై కేబుల్ బ్రిడ్జి ను మంజూరు చేయడం  ఖమ్మం కే అభివృద్ది ఐకాన్ గా నిలువనుంది అని ఆనందం వ్యక్తం చేశారు. ఒకప్పుడు త్రీ టౌన్ ను వెనుక బడిన ప్రాంతంగా చూసేవారు అని, కానీ నేడు త్రీ టౌన్ విలువైన ప్రాంతంగా మార్చి వన్నె తెచ్చిన మంత్రి పువ్వాడ కు ధన్యవాదాలు తెలిపారు.. జై పువ్వాడ.. జై జై పువ్వాడ.. అంటు నినాదాలతో హోరెత్తించారు. 75ఏళ్లుగా ఇక్కడ సమస్యను ఇప్పటి వరకు ఏ నాయకుడు పట్టించుకున్న పాపానపోలేదని కానీ మా కష్టాలు చూసిన మంత్రి పువ్వాడ స్పందించినందుకు వారికి మా జీవితాంతం రుణపడి ఉంటామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాటేటి అరుణ, పసుమర్తి రాంమోహన్, మాజీ కార్పొరేటర్ లు తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, పాలడుగు పాపారావు, నాయకులు కన్నం ప్రసన్న కృష్ణ, రుద్రాగాని ఉపేందర్, తోట వీరభద్రం, మాటేటి కిరణ్, జాని, మల్లేశం, యాదగిరి, సైదులు, త్రీ టౌన్ ప్రాంత స్ధానిక ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

allso read- తుమ్మలపై మంత్రి సెటైర్.. ఏమన్నారంటే..?