Telugu News

మునుగోడు కు సీఎం కేసీఆర్… ఎప్పుడంటే..?

పర్యటనను సక్సెస్ చేయాలని పార్టీ నాయకత్వానికి సీఎం ఆదేశం..?

0

మునుగోడు కు సీఎం కేసీఆర్.. ఎప్పుడేంటే..? 

== ఈనెల 20న మునుగోడులో బహిరంగ సభ..?

== పర్యటనను సక్సెస్ చేయాలని పార్టీ నాయకత్వానికి సీఎం ఆదేశం..?

== భారీగా ఏర్పాట్లు చేసే యోచనలో టీఆర్ఎస్

హైదరాబాద్, ఆగస్టు 13(విజయంన్యూస్)

సీఎం కేసీఆర్ మునుగోడు పర్యటన ఖారారైంది.. ఈనెల 20న మునుగోడు నియోజకవర్గంలో పర్యటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అతి కొద్ది రోజల్లోనే పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల కానుంది. ఆ పర్యనను జయప్రదం చేయాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. అందరు అశ్ఛర్యపడే విధంగా జనసమీకరణ ఉండాలని పార్టీ నాయకత్వాన్న ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ నాయకత్వం తగు ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమైయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా ఆ నియోజకవర్గంపై నాలుగు ప్రధాన పార్టీలు బలనిరూపణకు దిగుతున్నాయి. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, సిట్టింగ్ సీటు అయిన కాంగ్రెస్ పార్టీ, సిట్టింగ్ ఎమ్మెల్యే తను రాజీనామా చేసి చేరిన బీజేపీ పార్టీ, ఆరు సార్లు ఏకపక్షంగా విజయం సాధించినభారత కమ్యూనిస్టు పార్టీలు బరిలో నిలిచి గెలిచేందుకు తగు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారం షూరు చేశాయి. ఈ ఎన్నికను కచ్చితంగా రెపరేండంగా తీసుకుంటున్న పార్టీలు సెమిపైనల్ గా భావిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తను మునుగోడు పోవేడే కరెక్ట్ అని భావించి పర్యటనను ఖారారు చేశారు. ఈ నెల 20న మునుగోడు నియోజకవర్గంలో పర్యటించి, బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలని సీఎం కేసీఆర్ భావించారు. దీంతో  తేది అధికారికంగా ఖారారైనప్పటికి షెడ్యూల్ ను అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది. అయితే సీఎం కేసీఆర్ వచ్చే బహిరంగ సభను జయప్రదం చేయాలని, ఎప్పుడు రానంతగా జన సమీకరణ చేయాలని స్థానిక టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.  ఈ మేరకు సీఎం కేసీఆర్  కూడా ఈ పర్యటనను జయప్రదం చేయాలని పార్టీ అగ్రనాయకత్వానికి చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నడు జరగని విధంగా బహిరంగ సభ జరగాలని, భారీ మొత్తంలో జనసమీకరణ చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. కాగా రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ జనసమీకరణకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి : పాలేరు ఎమ్మెల్యే అనుచరుడి బూత్ పురాణం