Telugu News

కేసీఆర్ జాతీయ పార్టీకి ముహుర్తం పిక్స్..

దేశవ్యాప్తంగా ముఖ్యనేతలకు ఆహ్వానం

0

కేసీఆర్ జాతీయ పార్టీకి ముహుర్తం పిక్స్..?

== దేశవ్యాప్తంగా ముఖ్యనేతలకు ఆహ్వానం

== బీజేపీ యాంటీ టీమ్ తో ముందుకు నడిచే యోచన

(హైదరాబాద్-విజయంన్యూస్)

సీఎం కేసీఆర్ కొత్తగా పార్టీ పెట్టేందుకు నిర్ణయించారు.. జాతీయ స్థాయిలో పార్టీని ఏర్పాటు చేయాలని, కేంద్రంలో చక్రం తిప్పాలని ఆశపడుతున్న సీఎం కేసీఆర్ అందుకు తగిన పనులన్నింటిని పూర్తి చేసుకుంటున్నారు. అతి కొద్ది రోజుల్లోనే పార్టీని స్థాపించి ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ప్రధాన సెంటిమెంట్ గా భావించే దసరా పండుగకు కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు గాను సమయంతో కూడిన ముహుర్తం పిక్స్ అయినట్లు తెలుస్తోంది.

allso read- మధిరలో కోల్డ్ స్టోరేజ్ యజమాన్యంపై హిజ్రాల ముకూమ్మడి దాడి

గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ కావాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ కొత్త పార్టీ పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అనేక సార్లు అనేక వేదికలలో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్  కేంద్రస్థాయిలో నూతన పార్టీని ప్రకటించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. దసరా పర్వదినం సందర్భంగా కొత్త పార్టీ పేరు అధికారికంగా ప్రకటన చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. పార్టీ పేరుతో పాటుగా జెండా -అజెండా ను ఖరారు చేయనున్నారు. అక్టోబర్ 5న దసరా నాడు పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటుగా ఎంపీలు – ఎమ్మెల్సీలు- ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని పార్టీ సూచించింది. దసరా నాడు కీలక ప్రకటన ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షులు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కోరుతూ తీర్మానాలు చేశారు. అటు ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ అమలు చేస్తున్న విధానాల పైన అవకాశం వచ్చిన ప్రతీ సందర్బంలోనూ నిలదీస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. తమిళనాడు – బీహార్ – ఢిల్లీ- జార్ఖండ్- పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహించారు. కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో సుదీర్ఘ సమావేశం జరిపారు. బీహార్ వెళ్లిన సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా అందరం ఏకమవుతామని కేసీఆర్ – నితీశ్ ప్రకటించారు.

allso read- జీవితకాలమంతా జనంకోసం ధారపోసిన మహావీరుడు లక్ష్మణ్ బాపూజీ: మంత్రి పువ్వాడ

ఇక, ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన – కార్యాచరణ ప్రకటించేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకొని పోవాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఆయన పార్టీ ప్రకటన రోజున కొంత మంది ముఖ్యనాయకులను మాత్రమే ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రధాన నాయకత్వాన్ని పిలిచి పార్టీ పేరు, జెండా, ఏజెండాను ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి సీఎం కేసీఆర్ జాతీయ పార్టీలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకేన్ని జరుగుతాయో..?