సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్..
(హైదరాబాద్ – విజయం న్యూస్):-
యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు.
యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నయ పంటలను సాగు చేయండి.
కేంద్రం కొనడం లేదు కాబట్టే కఠినమైన నిర్ణయం తీసుకున్నాం.
కేంద్రం దుర్మార్గమైన, రైతు హత్యల ప్రభుత్వం.
రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చి క్షమాపణ కోరిన మోడీ.. రైతులను చంపిన ప్రభుత్వం అది.
యాసంగి పంటలు ఎంత కొంటరో చెప్పండ్రా బాబు అంటే ముచ్చట్లు చెబుతున్నరు.
దేశంలోనే అతి గొప్ప ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.
ప్రపంచంలోనే అతి దుర్మార్గమైన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం.
రైతులపై మరో భారం మోపేందుకు కేంద్రం కుట్రపన్నుతోంది.
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది.
రైతులను మోసం చేస్తే మోసపోవుడు ఖాయం.
ఎన్నికల కోసమే రైతు చట్టాలను రద్దు చేసిండ్రు.. ఇది ప్యాక్ట్.
తెలంగాణ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేసింది.
24గంటల పాటు వ్యవసాయానికి కరెంట్ ఇచ్చినం.. రైతులకు పంటల సాగు కోసం రైతు బంధు ఇచ్చినం..
ఎరువులు, విత్తనాలను మస్తుగా మార్కెట్లో పెట్టినం.
ఎరువులు, విత్తనాల ధరలను పెంచి పబ్బం గడుపుకుంటున్న ప్రభుత్వం మోదీ ప్రభుత్వం.
ఇక కేంద్రాన్ని వదులుడు లేదు.. దింపే వరకు పోరాటం చేస్తాం.. రాష్ర్టంలో బతకనివ్వం.. కేంద్రంలో ఉండనివ్వం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండో, మూడో సీట్లు పోతయ్.. మాకు తెలుసు..
పోయినంతమాత్రనా ప్రభుత్వానీకేం కాదు..
110మంది ఎమ్మెల్యేలు ఉన్న అతిపెద్ద పార్టీ మాది
కేసీఆర్ ను బయపెట్టాలంటే ఎవరితరం కాదు
రాష్ర్టంలో కేంద్రమంత్రి ఉన్నడంటే హనుమంతుడు లాంటోడనుకున్నం కానీ రావణాసుడు అనుకోలే
వడ్లు కొనాలని కోట్లాడాల్సిందిపోయి.. కొనం అంటూ తెల్చి చెబుతుడటం దుర్మార్గం
కిషన్ రెడ్డి వరస్ట్ మంత్రి.. ఆయన తెలంగాణ ప్రజలను మోసం చేస్తుండు.
also read :- కరోనా కొత్త వేరియంట్ : ఒమిక్రాన్’పై కేబినెట్లో చర్చ..