ఉపాధి హామీ ఉద్యోగుల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా: మంత్రి పువ్వాడ
సమస్యలను పరిష్కరించేంత వరకు క్రుషి చేస్తా
ఉపాధి హామీ ఉద్యోగుల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా: మంత్రి పువ్వాడ
== సమస్యలను పరిష్కరించేంత వరకు క్రుషి చేస్తా
== ఉపాధిహామీ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మంలోని టీఎన్జీవో ఫంక్షన్ హల్ లో ఆత్మీయ సమ్మేళనం మంత్రి పువ్వాడ అజయ్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ప్రారంభం నుంచి చాలీచాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నాం.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,874 మంది ఉపాధిహామీ ఉద్యోగులు పనిచేస్తున్నామని,వారందరికీ ప్రభుత్వం పే స్కెల్ వర్తింపజేసేందుకు కృషి చేయాలని ఉద్యోగులు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కోరారు. ఉపాధిహామీ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మంలోని టీఎన్జీవో ఫంక్షన్ హల్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఇది కూడా చదవండి: ప్రజా అవసరాల కోసమే అభివృద్ది పనులు: మంత్రి పువ్వాడ
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఎన్జీవో జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు షేక్.అప్జల్ హసన్,ఆర్.వి.ఎస్ సాగర్ మరియు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నందగిరిశ్రీను హాజరయ్యారు. ఇందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందిస్తూ ఉపాధిహామీ హామీ ఉద్యోగుల పే స్కెల్ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.ఉపాధిహామీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
== ఉపాధి హామీ ఉద్యోగుల పే స్కెల్ సమస్య టీఎన్జీవో కేంద్ర సంఘం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తాం: అప్జల్ హసన్ .
ఉపాధిహామీ ఉద్యోగుల పే స్కెల్ వర్తింపు సమస్య గూర్చి గతంలో కూడా టీఎన్జీవో కేంద్ర సంఘం దృష్టికి తీసుకెళ్ళాం.మరోసారి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహకారం తో,టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు మామిళ్ళ రాజేందర్,మారం జగదీష్ ల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని టీఎన్జీవో యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హసన్ అన్నారు.
ఇది కూడా చదవండి: మొక్కజొన్న, ధాన్యం సేకరణ పూర్తి చేయాలి: మంత్రి పువ్వాడ
ఉపాధిహామీ ఉద్యోగుల పక్షాన టీఎన్జీవో సంఘం వెన్నంటి ఉంటోందన్నారు. ఇటీవలే ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల జీవితాలలో వెలుగులు నింపి, వారి ఉద్యోగాలను రెగ్యులైజ్ చేసిందని గుర్తు చేశారు.ఉపాధిహామీ ఉద్యోగుల సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తాదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో టీజీవో జిల్లా అధ్యక్షులు ఆళ్ల శ్రీనివాస రెడ్డి, రైటర్డ్ ఎంపిడిఓ ల అధ్యక్షులు నవాబు పాషా,ఉపాధి హామీ ఉద్యోగుల జిల్లా జేఏసీ చైర్మన్ కోటయ్య,భద్రాద్రి జిల్లా జేఏసీ అధ్యక్షులు సుధాకర్, రాష్ట్ర జేఏసీ కో ఛైర్మెన్ జలీల్ పాల్గొన్నారు.