Telugu News

యాదవులు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం : కందాళ

= నాయకన్ గూడెంలో బాలరాజుయాదవ్ కు ఘన స్వాగతం == మేకలు,గొర్రెల లబ్ధిదారులతో మాట్లాడిన పాలేరు ఎమ్మెల్యే, చైర్మన్ == లబ్ధిదారులకు గొర్రెలు, మేకలు పంపిణి

0

యాదవులు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం : కందాళ
== నాయకన్ గూడెంలో బాలరాజుయాదవ్ కు ఘన స్వాగతం
== మేకలు,గొర్రెల లబ్ధిదారులతో మాట్లాడిన పాలేరు ఎమ్మెల్యే, చైర్మన్
== లబ్ధిదారులకు గొర్రెలు, మేకలు పంపిణి
(కూసుమంచి-విజయంన్యూస్)
రాష్డంలో యాదవులంతా ఆర్ధికంగా అభివృద్ధి చెందాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, గొర్రెల మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఛైర్మెన్ దూదిమెట్ల బాలరాజు అన్నారు.. గురువారం నాయకన్ గూడెం గ్రామంలో యాదవులకు గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాలరాజు యాదవ్, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హాజరైయ్యారు. వారికి పశుసంవర్థక శాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే యాదవ కులసంఘాల నాయకులు బాలరాజుకు ఘనంగా స్వాగతం పలికారు.

బుకేలను అందించి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కుల వృత్తులను గౌరవిస్తూ వారి ఆర్ధికాభివృద్ధికి చేయూతనిస్తూ సమాజంలో గౌరవంగా జీవించేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు.తెరాస ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును గుర్తించి కేసీఆర్ కు అన్ని వర్గాల ప్రజలు నైతిక మద్దతునిచ్చి ఆశ్వీరధించాలని పిలుపునిచ్చారు. గొర్రెల మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఛైర్మెన్ దూదిమెట్ల బాలరాజు మాట్లాడుతూ యాదవులు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకొని సమాజంలో గౌరవంగా జీవించేందుకు ఆర్ధికంగా బలోపేతం కావాలని ఆకాక్షించారు.

ALSO READ :-చింతగుఫాలో పుడ్ పాయిజన్..28మంది కి అస్వస్థత

ALSO READ :-ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు

గత ప్రభుత్వాలు గొల్లకుర్మలను గుర్తించిన పాపాన పోలేదని, యాదవులంటే గత ప్రభుత్వాలు చాలా చిన్నచూపుగా చూసేవాని అన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో, సీఎం కేసీఆర్ నాయకత్వంలో యాదవులకు అన్ని రంగాల్లో పెద్దపీఠ వేస్తున్నారని తెలిపారు. మంత్రివర్గంలో మంచి అవకాశాలు ఇవ్వడమే కాకుండా నామినేటేడ్ పోస్టుల్లో కూడ యాదవులకు మంచి అవకాశాలిస్తున్నారని తెలిపారు. అలాగే కులవ్రుత్తిని నమ్ముకుని ఇప్పటికి జీవాలు కాచుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద యాదవకులస్తులను ఆదుకోవాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మేకలు, గొర్రెలను గొల్ల,కుర్మలకు పంపిణి చేస్తోందని అన్నారు. గొర్రెలు,మేకలను పెంచుకోవడం వల్ల మంచి ఆధాయం ఉందని, వాటిని కాచే కాపరులకు ప్రభుత్వం మెరుగైన పథకాలను అందించేందుకు సిద్దంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గొర్రెలను పంపిణి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సిద్దంగా ఉందని అన్నారు. కరోనా రాకపోయి ఉంటే ఇప్పటికే అందరికి గొర్రెల పంపిణి కార్యక్రమం పూర్తి చేసేవాళ్లమని తెలిపారు.

ఇప్పటికైన అర్హులైన ప్రతి ఒక్కరికి గొర్రెలను పంపిణి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భానోత్ శ్రీనివాస్ నాయక్, ఏఎంసి ఛైర్మెన్ సేట్రాం నాయక్,ఆత్మ కమిటి ఛైర్మెన్ బాలకృష్ణారెడ్డి, సర్పంచ్ కాసాని సైదులు, వైస్ ఎంపీపీ కంచర్ల పద్మవీరారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్,మేకల, గొర్రెల మేకల ఫెడరేషన్ ఖమ్మం జిల్లా చైర్మెన్, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్, ఏడిఏ ఎస్ విజయ చంద్ర,ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డి, నాయకులు ఆలింగ గోవిందరెడ్డి,జహంగీర్ నాగరాజు వీర నాగులు తదితరులు పాల్గొన్నారు.