Telugu News

నిరుపేదల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం:మంత్రి పువ్వాడ 

ప్రతి పేదవాళ్లను దనికులను చేసేందుకు సంక్షేమ పథకాలు

0
నిరుపేదల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం:మంత్రి పువ్వాడ 
==  ప్రతి పేదవాళ్లను దనికులను చేసేందుకు సంక్షేమ పథకాలు
== ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు
== దేశస్థాయిలోనే తెలంగాణ సంక్షేమ పథకాలు బెస్ట్ 
== మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 
==  ఖమ్మంలో ఘనంగా సంక్షేమ సంబురం కార్యక్రమం.. హాజరైన మంత్రి పువ్వాడ, కలెక్టర్, ప్రజాప్రతినిధులు
ఖమ్మంప్రతినిధి, జూన్‌,09(విజయంన్యూస్):
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గతంలో ఎన్నడూ లేని విధంగా పేద నిరుపేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ, అభివృద్ధి  కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి:- మీరుండగా వాళ్లు నన్నేం పీకలేరు..: మంత్రి పువ్వాడ

గొల్ల, కురుమలు ఆర్ధిక పరిపుష్టి సాధించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం గొర్రెల యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని రెండవ విడతలో రూ.6,085 కోట్లతో 3.38 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపినీ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.  ప్రభుత్వం అందించిన గొర్రెల పంపిణీ పథకంతో గొల్ల కురుమలు రూ.8 వేల కోట్ల సంపద అర్జించారని మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ మాట్లాడుతూ జి.ఓ 58, 59 పథకం క్రింద ఎలాంటి ఆదెరువు లేని నిరుపదలు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న వారికి ప్రభుత్వ వారి ఇంటిపై వారికి పూర్తి హక్కు కల్పించాలనే సంకల్పంతో ఖమ్మం నగరంలో ఇప్పటి వరకు 2 వేల 500 మంది పేదలకు పైగా పెద్ద ఎత్తున పట్టాలను అందించడం జరిగిందని కలెక్టర్‌ తెలిపారు.
ఇది కూడా చదవండి:- రైతు పక్షపాతి సీఎం కేసీఆర్: మంత్రి పువ్వాడ
కార్యక్రమంలో నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, నగరపాలక సంస్థ కమీషనర్‌ ఆదర్శ్‌ సురభి, పశుసంవర్ధక శాఖ జెడి.వేణుమనోహర్‌, బి.సి వెల్ఫేర్‌ అధికారి జ్యోతి, కార్పోరేటర్‌లు పగడాల నాగరాజు, శ్రీ విద్యా, కర్నాటి కృష్ణ, రాంమోహన్‌రావు, శ్రీకాంత్‌, శ్రీదేవి, వెంకటేశ్వర్లు,జ్యోతి రెడ్డి,హుస్సేన్, శ్రీనివాస్,లక్ష్మి, గోవిందమ్మా, ఉమారాణి, కమల,రోజలిన, విజయనిర్మల, సరస్వతి, వైశ్నవి,రోషిని,కరుణ, రమ,లక్ష్మి, అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు
తదితరులు పాల్గొన్నారు.