నిరు పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్…!
—ఎమ్మెల్యే డి ఎస్ రెడ్డ్యా నాయక్
(మహబూబాబాద్- విజయం న్యూస్);-
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరు పేదలకు వరంలాంటిది సీఎం రిలీఫ్ ఫండ్ అని పేదలను అభివృద్ధి చేయడమే టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని డోర్నకల్ శాసనసభ్యులు డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. మంచ్యా తండా లోని తన నివాసం లో నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన బాధితులకు మంజూరైన సిఎం రిలీప్ పండ్ చెక్కులను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకం ద్వారానే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం వర్తించని వ్యాధులకు, పేదలకు ఆదుకోవడం కోసం సిఎం కెసిఆర్ లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారని ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
also read;-ముచ్చర్లలో నగదు చోరీ
దేశంలో ఎక్కడలేని విధంగా మన రాష్ట్రంలో ప్రజాకర్షక పథకాలను రూపకల్పన చేసిన సిఎం కెసిఆర్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, బంగారు తెలంగాణ నిర్మాణం లో బాగంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు.పేదవారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేసిన సిఎం కెసిఆర్ కి ఈ సందర్భంగా ఎమ్మెల్యే దన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎంపీలు జెడ్పీటీసీలు సర్పంచుల ఎంపిటిసిలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.