Telugu News

సాహస బాలుడ్ని అభినందించిన సీఎం రేవంత్

అగ్నిప్రమాదంలో ఆరుగుర్ని కాపాడిన బాలుడు సాయికిరణ్

0

సాహస బాలుడ్ని అభినందించిన సీఎం రేవంత్

== అగ్నిప్రమాదంలో ఆరుగుర్ని కాపాడిన బాలుడు సాయికిరణ్

(హైదరాబాద్ -విజయం న్యూస్)

సాహస బాలుడు ఎం.సాయిచరణ్ ను  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ నెల 26న షాద్ నగర్ నందిగామ శివారులోని ఓ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం జరిగింది . కోట్ల రూపాయల విలువైన అస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదం జరుగుతుండగా ఏ మాత్రం భయపడకుండా అపార్ట్మెంట్ లో ఉన్న ఆరుగురిని  సాయిచరణ్ కాపాడారు. ఆ సమయంలో స్థానికులు బాలుడు సాహసం చేస్తుండగా వీడియోలు, పోటోలు తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. దీంతో అభినందనల వర్షం కురిసింది. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్, రంగారెడ్డి పోలీసు ఉన్నతాధికారులు ఆ బాలుడ్ని కలిసి అభినందించారు. ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కి తెలియజేయగా ఆదివారం _సాయిచరణ్  సాహసాన్ని సీఎం అభినందించారు.వారి కుటుంబానికి అభినందనలు తెలిపారు. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన 15ఏళ్ల సాయిచరణ్.._రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామకు చెందిన సాయిచరణ్.._

_సాయిచరణ్ సాహసాన్ని అభినందించిన సీఎం._