Telugu News

సీఎం పరువుపోతుందనే రేవంత్ ను అడ్డుకున్నారు

== రచ్చబండ కార్యక్రమం అడ్డుకున్న ప్రభుత్వంపై పువ్వాళ్ళ, జావిద్ పైర్

0

సీఎం పరువుపోతుందనే రేవంత్ ను అడ్డుకున్నారు
== రచ్చబండ కార్యక్రమం అడ్డుకున్న ప్రభుత్వంపై పువ్వాళ్ళ, జావిద్ పైర్
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
యాసంగి పంటలను సాగు చేస్తూ తెలంగాణ రైతులను నిలువున మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ బాగోతాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చూపించేందుకు సీఎం కేసీఆర్ స్వంత ఊరు ఎర్రవెల్లి వెళ్తుంటే ప్రభుత్వం, పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేయడం దుర్మార్గమని, సీఎం కేసీఆర్ పరువుపోతుంది, రైతులు నన్ను నమ్మరు, అందుకే రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ నేతలను ఇంటివద్దనే మూసేస్తే బాగుంటుందని భావించి అరెస్టులు చేయించారని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్, ఖమ్మం నగర అధ్యక్షుడు ఎండీ.జావిద్ ఆరోపించారు.

సీఎం దత్తత గ్రామం ఎర్రవెల్లి లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఏమ్మెల్యే శ్రీధర్ బాబు లతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులతో గృహనిర్బంధం చేయించిన టీఆర్ఎస్ సర్కారు చర్యను తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించారు. దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించిన రాజ్యాంగానికి విరుద్ధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఆహార ఉత్పత్తి పెంచాలని, ఆహారధాన్యాల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని అన్నారు. కానీ, ఆ బాధ్యతను విస్మరించి రాష్ట్రంలో వరి పండించొద్దని ప్రభుత్వం పోలీసులు, అధికారులతో రైతుల పై ఒత్తిడి చేయించడం దుర్మార్గమని ధ్వజ మెత్తారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా !ఉంటుందని. అన్నదాతలు అధైర్యపడొద్దని. ధాన్యం కొనుగోలు చేయకుంటే బీజేపీ టీఆర్ఎస్ సర్కార్ లపై కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుందని అన్నారు

also read:-*కోవిడ్ ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు : బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్