Telugu News

నల్లగొండకు సిఎం వరాల జల్లు

నుడా పై అధికారులతో సిఎం సవిూక్ష

0

నల్లగొండకు సిఎం వరాల జల్లు

== నుడా పై అధికారులతో సిఎం సవిూక్ష

== పలు కార్యక్రమాల ప్రకటన

(నల్లగొండ-విజయం న్యూస్):-
నల్లగొండ పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి వరాల జల్లు కురిపించారు. నల్లగొండ మున్సిపాలిటీని ఆధునికరించేందుకు గాను నుడా నల్లగొండ అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ గా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు మరిన్ని వరాలు ప్రకటించారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి దివంగత నర్సింహ దశదిన కర్మలో పాల్గొనేందుకు సీఎం గురువారం నార్కట్‌పల్లికి చేరుకున్నారు. అనంతరం జిల్లాకు చెందిన విద్యుత్‌ శాఖామంత్రి జగదీష్‌ రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి,మున్సిపల్‌ చైర్మన్‌ మందాడి సైదిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి తదితరులతో కలసి నుడా పై సీఎం కేసీఆర్‌ సవిూక్షా సమావేశం నిర్వహించారు.

also read :-ఖమ్మం నగరంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణి

జిల్లా కేంద్రం ప్రవేశంలో ఉన్న మర్రిగూడ బైపాస్‌ రోడ్‌ పై ప్లైఓవర్‌ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అంతే గాకుండా నల్లగొండ నడిబొడ్డున ఉన్న పెద్ద గడియారం సెంటర్‌లో ప్రస్తుతం ఉన్న ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహం స్థానంలోనే అధునాతన సౌకర్యాలతో నాలుగు అంతస్థుల ఆర్‌ అండ్‌బీ వసతి గృహం నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దానికి తోడు నల్లగొండ`నాగార్జున సాగర్‌ రహదారిపై ఉన్న ఎస్‌ఎల్‌బీసీ కార్యాలయ ప్రాంగణంలో చీఫ్‌ ఇంజినీర్‌ కార్యాలయం నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడిరచారు. కాగా, సీఎం కేసీఆర్‌ ప్రకటనలతో జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.