Telugu News

ఖమ్మం కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎంలు

అద్భుతమైన నిర్మాణం అని సీఎంను అభినందించిన సీఎంలు

0

ఖమ్మం కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎంలు

== అద్భుతమైన నిర్మాణం అని సీఎంను అభినందించిన సీఎంలు

== కలెక్టర్ ను సీట్లో కుర్చోబెట్టి అభినందనలు తెలిపిన సీఎంలు

ఖమ్మం, జనవరి 18(విజయంన్యూస్):

 ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు పినరాయ్ విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ సింగ్ మాన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రాజా ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు యాదాద్రి నుంచి హెలీకాప్టర్లలో ఖమ్మం చేరుకున్న ముఖ్యమంత్రులు, జాతీయ నేతలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకున్నారు.  సీఎం కేసీఆర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ గురించి జాతీయ నేతలకు సీఎం కేసీఆర్‌ వివరించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను జాతీయ నేతలు తిలకించారు. సీఎం కేసీఆర్‌ కలెక్టరేట్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలు నేతలకు వివరించారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో రెండవ విడుత కంటి వెలుగు షురూ..

పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను నిర్మించాలని భావించారు. ఆ తర్వాత భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని పూర్తి కావచ్చాయి. ఇందులో భాగంగానే ఖమ్మం వైరా ప్రధాన రహదారి వి. వెంకటాయపాలెం వద్ద తెలంగాణ సర్కారు నయా కలెక్టరేట్‌ను నిర్మించింది. వెయ్యి అడుగుల ఫేసింగ్‌, 11 వందల అడుగుల లోతు ఉండేలా చేపట్టే ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను రూ.53.20 కోట్ల వ్యయంతో నిర్మించింది.

అన్ని వసతులతో అత్యంత సౌకర్యవంతంగా సమీకృత కలెక్టరేట్‌ రూపుదిద్దుకున్నది.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస గౌడ్, శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రిజ్వీ, కమీషనర్ శ్వేతా మహంతి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, మాలోతు కవిత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పొలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, తాతా మధుసూదన్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, లావుడ్యా రాములు నాయక్, మల్లు బట్టి విక్రమార్క, వనామా వెంకటేశ్వర రావు, హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి రావు, అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ‘ఖమ్మం గుమ్మం’ గులాబీ మయం