Telugu News

చలి పులి …ఒంటిపై వస్త్రము కరువై.

తమ చర్మమే వస్త్రంగా బ్రతుకుతున్న దీనులు దీనికి విరోధులు

0

// అభాగ్యులు //

చలి పులి …ఒంటిపై వస్త్రము కరువై.

తమ చర్మమే వస్త్రంగా బ్రతుకుతున్న దీనులు దీనికి విరోధులు.

వాళ్ళ మోకాళ్ను చాతికి తాకించి.

మనిషిని మెత్తం గుండ్రని బంతిలా చుట్టజుట్టేసి.

రాత్రంతా అటూ ఇటూ దొర్లిస్తూ గొప్ప ఆటగాడిలా బంతాట ఆడేసుకొంటుంది వారిని చలి...

 

చల్లని చలిగాలితో కొట్టి కొట్టి.
చర్మం నీరింకిపోయిన నేల నెర్రలు తీసినట్లుగా మార్చేసి.
దేహాన్ని ఛిద్రం చేస్తూ.
ఆ బాధకు తట్టుకోలేని ప్రాణాలను యముడికి కానుకగా పంపిస్తుంది.

పోనీ దిక్కులేక అడుక్కుని తెచ్చుకొన్నదేదో ఆసరా చేసుకొందామని.
రోడ్డుపక్క చేత్తతో మంటేసుకొన్నా.
బీదవాడేదో సుఖపడిపోతున్నట్టు.
అది చూచి దాని కళ్ళు మండిపోతున్నట్టు.
నిద్రాదేవతతో మంత్రాంగ జరిపి.
బక్కజీవికి మత్తుమందిచ్చి తూలి పడేటట్టు నిద్రను రప్పిస్తూ…
అగ్గి దేవుడను రెచ్చగొట్టి.
వాళ్ళ ఒళ్ళును అంటించేస్తుంది…

ఉన్నవాడింట్లోకి వెళ్ళడానికి చలికి శక్తి లేక.
ఆరుబైట గుంజకు కట్టేసిన మూగజీవాలపై దాడిచేసే క్రూరమృగంలా.
బీదవాడి గుడిసెల్లో దూరి వారి దేహాన్ని లూటీ చేచేస్తుంది ఈ చలి పులి…

ఓ దయగల దయామయులారా.
మనం వాడని పాతవస్త్రాలనైనా.
చలి పులిపై యుద్దానికి ఆ అభాగ్యులకు ఆయుధాలుగా ఇద్దాం రండి.

also read :- ఓ ట్విటర్‌ పోస్టు.. ఆర్టీసీ చార్జీలు తగ్గించింది.