Telugu News

ఇరిగేషన్ శాఖలో పైసా వసూల్..?

ఇల్లెందు ఇరిగేషన్ లో ఆ పర్వం కొనసాగుతున్నట్లు ప్రచారం

0

ఇరిగేషన్ శాఖలో పైసా వసూల్..?

== ఇల్లెందు ఇరిగేషన్ లో ఆ పర్వం కొనసాగుతున్నట్లు ప్రచారం

– కాంట్రాక్టర్లు పట్టిపీడిస్తున్న అధికారులుసిబ్బంది

– ఎంబి చేయాలంటే పర్సంటేజ్ ఇవ్వాల్సిందేనంటా..?

– గతంలో ఇదే డిపార్ట్మెంట్లో ఏసీబీ కి దొరికిన ఇంజనీర్

– అయినా కొనసాగుతున్న పర్సంటేజీల పర్వం

– ఉన్నత స్థాయి అధికారులు చెక్ పెట్టేనా..?

(తమ్మిశెట్టి-ఇల్లెందు-విజయం న్యూస్)

అగ్రిమెంట్ కి ఇవ్వాలిఎం బిఇవ్వాలి. కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులకు పర్సంటేజ్ ఇవ్వాల్సిందే. లేదంటే బిల్లు రావడం అంత ఈజీ కాదు. అంతేకాకుండా ఒక వర్క్ కు మూడు సార్లు బిల్లు వస్తే మూడుసార్లు పర్సంటేజ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల పట్ల కాంట్రాక్టర్లు చితికి పోతున్నారు. మా గూడు పట్టించుకునేది ఎవరని ఆవేదన చెందుతున్నారు. ఇది ఇల్లందు ఇరిగేషన్ వింత పరిస్థితి.

చిన్న,చితక పనులు చేసే కాంట్రాక్టర్లు చితికి పోతున్నారు. ఐదు పది లక్షలు లోపు వర్కులు చేసుకునే ఒకరిద్దరు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు .5 లక్షల పనులకు రెండుసార్లు బిల్లు వస్తే అగ్రిమెంట్ తో సహా మూడుసార్లు పర్సంటేజ్ ఇవ్వాల్సి వస్తుంది . లేదంటే బిల్లులు వాయిదా పడాల్సిందే.

ఇది కూడా చదవండి: ఇల్లెందులో హీటెక్కిన రాజకీయం

ఇది ఇల్లెందు  ఇరిగేషన్ పరిధిలోని అధికారుల పరిస్థితి. ఆన్లైన్ టెండర్ లను దక్కించుకోవాలంటే ఎంతో కొంత లెస్ కి వేయాల్సి ఉంటుంది .లెస్ వేసిందే కాకుండా అగ్రిమెంట్ సందర్భంగా ఆఫీస్ సిబ్బందికి ఎంతో కొంత పర్సంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎం బి చేసేటప్పుడు ఒక్కరూ ,ఇద్దరూ అధికారులకు  సమర్పించుకోవాల్సిందే. బిల్లు వచ్చేటప్పుడు పై అధికారి స్థాయిలో పర్సంటేజ్ చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే బిల్లులు వాయిదా పడాల్సి ఉంటుంది. ఇట్ల పిడి పిప్పి చేస్తుంటే గతంలో ఓ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు. అప్పటికప్పుడు ఆ అధికారి సస్పెండ్ అయ్యాడు. అయినప్పటికీ అధికారులలో ఎటువంటి మార్పు రాలేదు యధావిధిగా పర్సంటేజ్ ల పర్వం కొనసాగుతుంది. ఉన్నత స్థాయి అధికారులు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది .లేదంటే సన్నచిన్న కారు కాంట్రాక్టర్లు జేబులు గుల్ల చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆన్లైన్ టెండర్ అంటే వేయడానికి కాంట్రాక్టు జంకుతున్నారు .వచ్చేదే కొంతఅందులో అధికారులకు ఇంతమనకు మిగిలేది ఎంత అంటూ ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇది కూడా చదవండి: నేను శీనన్న వెంటే: కోరం కనకయ్య