Telugu News

రొంపిమళ్లలో కలెక్టర్ ఇంటింట సర్వే

రొంపిమళ్ల ఎస్సీకాలనీలో బసచేసిన కలెక్టర్

0

రొంపిమళ్లలో కలెక్టర్ ఇంటింట సర్వే
== రొంపిమళ్ల ఎస్సీకాలనీలో బసచేసిన కలెక్టర్
== ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్న కలెక్టర్ గౌతమ్
== దళితబంధు లబ్దిదారులందరు కోటీశ్వర్లు కావాలి : కలెక్టర్
(మధిర, ఖమ్మం-విజయంన్యూస్)
జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ పట్టుదల అంటే ఇదేనేమో..? ఏ కలెక్టర్ చేయని పని ఆయన చేస్తున్నాడు. ప్రభుత్వ పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయాలంటే జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులను పంపించే కలెక్టర్లను చూశాం. కానీ స్వయంగా కలెక్టర్ రంగంలోకి దిగి ఆ గ్రామంలో పర్యటించి, బస చేసి లబ్దిదారులను ఎంపిక చేయడం చూశామా.. చాలా అరుదు కదా..? కానీ ప్రస్తుత ఖమ్మం జిల్లా కలెక్టర్ మాత్రం స్వయంగా ఓ గ్రామంలో బస చేసి, ఆ తరువాత ఇంటింటికి తిరిగి లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు.

also read :-బయ్యారంలో భగ్గుమన్న ఉక్కు దీక్ష…!

ఇంటింటికి తిరిగి దళితకుటుంబాలతో మాట్లాడుతున్నారు. దళితుల అర్థిక పరిస్థితులు, స్థితిగతులను అడిగి తెలుసుకుంటున్నారు. లబ్ధిదారులకు దళితబంధు పథకం ఉద్దేశ్యంపై అవగాహణ కల్పిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ఖమ్మం జిల్లాలో కూడా అమలు చేస్తున్నారు. ముందుగా ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గం, చింతకాని మండలంలో ఓ గ్రామాన్ని ఎంపిక చేసిన ప్రభుత్వం, ఆ తరువాత మధిర మండలంలోని రొంపిమళ్ల గ్రామాన్ని ఎంపిక చేసింది. దీంతో అక్కడ లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు జిల్లా కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగారు.

also read ;-***బ‌య్యారం ఉక్కు తెలంగాణ రాష్ట్ర హక్కు : నామా, పువ్వాడ

మధిర మండలం రొంపిమళ్ల గ్రామంలో గురువారం రాత్రి బస చేసిన జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉదయాన్నే మరల తిరిగి లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి వారి ప్రస్తుత వృత్తి, అనుభవం నైపుణ్యతను, వారి అభిప్రాయాలను స్వయంగా తెలుసుకొని దళితబంధు యూనిట్ల స్థాపన పట్ల సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దళితబందు లబిరులతో కలెక్టర్ మాట్లాడుతు వారం రోజుల లోపు దళితబంధు లబ్ధిదారుల ఖాతాకు రూ. 10 లక్షలు జమ అవుతాయని నైపుణ్యత, అనుభవం మేర పూర్తి స్వేచ్చతో ఆలోచన చేసి యూనిట్ల స్థాపనకు సంసిద్ధంగా ఉండాలని దళిత బంధు లబ్దిదారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.

అనంతరంగ్రామంలోని కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన లబ్ధిదారుల ముఖాముఖి చర్చ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళిత సాధికారతకై ప్రయోగాత్మకంగా తీసుకున్న దళితబంధు కార్యక్రమం ద్వారా రూ.10 లక్షలతో అంచెలంచెలుగా ఎదిగి ప్రతి లబ్ధిదారుడు కోటీశ్వరుడు కావాలని కలెక్టర్ అన్నారు. రొంపిమళ్ల లబ్దిదారుల ప్రతి ఇంట్లో విద్యావంతులు ఉన్నారని ఆదర్శ దళితవాడగా నిలిచిందని, ఇది కేవలం విద్యతోనే సాధ్యమవుతుందని కలెక్టర్ అన్నారు. సమాజంలో దళితులు వివక్షకు గురికాకుండా వారి సాధికారత కోసం గౌరవ ముఖ్యమంత్రివర్యులు దళితబంధుకు శ్రీకారం చుట్టారని కలెక్టర్ తెలిపారు.

also read :-****నాగార్జున కొండకు లాంచీలు సిద్ధం

గతంలో లాగ సబ్సిడీ రుణాలు కాకుండా పెద్దఎత్తున లబ్ధిదారుల సామాజిక, ఆర్ధిక స్థితిగతులను అభివృద్ధి పరిచే దిశగా ప్రభుత్వం దళితబంధును అమలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. రొంపి మళ్లలో వివిధ వృత్తులలో నైపుణ్యతను కలిగిన లబ్దిదారులు సెంట్రింగ్ యూనిట్స్, ఎలక్రీకల్ షాప్స్, పాలి హౌజెస్, మెడికల్ షాప్స్, ల్యాట్లు, నర్సరీ, ఫ్యాన్సీ షాపులు, సిమెంట్ బ్రిక్ యూనిట్స్ తదితర యూనిట్ల స్థాపనకు ఆలోచన చేయడం పట్ల రొంపిమళ్ల లబ్దిదారుల పట్ల తనకు విశ్వాసం మరింత పెరిగిందని కలెక్టర్ అన్నారు.

లబ్ధిదారులకు వున్న అనుభవం, నైపుణ్యానికి తోడుగా పెట్టుబడి అందించి ప్రతి లబ్ధిదారుడు యజమానిగా మారాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని కలెక్టర్ తెలిపారు. దళితబంధు పథకానికి నిబంధనలు, షరతులు ఏమియు లేవని లబ్దిదారుడు రాష్ట్రంలో తాము ఎంచుకున్న ప్రదేశాలలో యూనిట్లను స్థాపించుకోవచ్చని కలెక్టర్ తెలియజేశారు. లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలను ప్రారంభించుకునేందుకు అధికారులే లబ్దిదారుల చెంతకు వస్తారని సరియైన దృవీకరణ పత్రాలు అందించి లబ్దిదారుల బ్యాంకు ఖాతాలు ప్రారభించుకోవాలని కలెక్టర్ ఆన్నారు.

also read :-సర్పంచుల గౌరవ వేతనం నేరుగా ఖాతాల్లోకి :వచ్చే నెల నుండి అమలు

దళితబంధు పథకంలో లబ్దిదారుల సంక్షేమానికై మరొక వినూత్న పథకం ఇమిడి యుందని లబ్ధిదారులకు అందించే 10 లక్షల రూపాయలలో 10 వేలు మినహాయించి దళిత రక్షణ నిధిలో జమచేయడం జరుగుతుందని లబ్దిదారులకు ఆర్ధిక పరంగా ఇబ్బందులు ఏర్పడిన యెడల ఇట్టి నిధి నుండి లబ్ధిదారులకు మరొకమారు ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

తమ గ్రామం, కుటుంబం, సమాజంలోని అనుభవజ్ఞులైన వ్యాపారస్తుల సలహాలు, సూచనలు తీసుకొని తమ ఆసక్తి మేర యూనిట్ల స్థాపనకు సిద్ధంగా ఉండాలని లబ్దిదారులకు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.అప్పారావు, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖాధికారి కె.సత్యనారాయణ, ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, ఎం.పి.పి యం.లలిత, సర్పంచ్ మదార్ సాబ్, ఎం.పి.డి.ఓ విజయభాస్కర్ రెడ్డి, తహశీల్దార్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.