Telugu News

క్రికెట్ ఆడిన కలెక్టర్

ముఖరా (కె) గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

0

క్రికెట్ ఆడిన కలెక్టర్

? ముఖరా (కె) గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

?జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..

(ఇచ్చోడ-విజయం న్యూస్)

ఇచ్చోడ మండలంలోని ముఖ్రా (కె) గ్రామం అన్ని రంగాలలో స్వయం సమృది వైపు పయనిస్తూ అభివృద్ధి చెందుతూ దేశానికే ఆదర్షంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

ఇది కూడా చదవండి:- ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దారుణహత్య

ముఖ్రా (కె) గ్రామంలో బుధవారం సందర్శించిన కలెక్టర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సొలార్ గ్రిడ్, డిజిటల్ లైబ్రరి, బృహత్ పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం లను సర్పంచ్ గాడ్గే మీనాక్షి తో కలిసి ప్రారంబించి మొక్కలు నాటారు.

కాసెపు క్రికెట్ అడిన జిల్లా కలెక్టర్ క్రీడకరులలో ఉత్సాహాన్ని నింపారు. అటు గ్రామం కోసం నిస్వార్తంగా పని చేస్తున్న సర్పంచ్ గాడ్గె మినాక్షి సుభాష్ లను ప్రశంస పత్రంతో అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలుగన్న పల్లెలగా ముఖరా (కె) గ్రామం అబివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ముఖరా (కె) ని అదర్షంగా తీసుకొని తమ గ్రామాని అబివృద్ధి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఎంపీపీ ప్రితం రెడ్డి, ఎంపీటీసీ సుభాష్, డిఆర్డీఏ పిడి కిషన్, అడిషనల్ పిడి రవిందర్, డిపిఓ శ్రీనివాస్, ఎంపిడిఓ రాం ప్రసాద్, సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపిటిసి గాడ్గే సుభాష్, పంచాయతీ సెక్రెటరీలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- జడ్పీ ఛైర్‌పర్సన్‌ పై అనర్హత వేటు