కూసుమంచిలో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
(కూసుమంచి-విజయంన్యూస్)
కూసుమంచి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆకస్మికంగా తణిఖీ చేసారు. కేంద్రంలోని విద్యార్థుల సంఖ్య హాజరయిన విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా తెలుసుకున్నారు. అదేవిధంగా పరీక్షా కేంద్రంలోని విద్యార్థుల హాల్ టికెట్ ను విద్యార్థులతో సరిచూసారు. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలని, పరీక్షా కేంద్రంలోని పరిసర ప్రాంతాల్లోని జీరాక్స్ సెంటర్లను మూసివేయాలని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన కనీస వసతులు సమకూర్చాలని పాఠశాల బాధ్యులను కలెక్టర్ ఆదేశించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణాధికారి యస్.కె.హసన్, తదితరులు పాల్గొన్నారు.
== కూసుమంచిలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
also read :-ప్రజల మధ్య ఐకమత్యం, మతసామరష్యం, సోదరభావము అవసరం – తాతా మధుసూదన్
also read :-ఖమ్మం నగర కార్పోరేషన్ ఏడాది సంబురాలు
కూసుమంచి మండలంలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. కూసుమంచి హైస్కూల్ లో జరుగుతున్న పరీక్ష కేంద్రంలో మొత్తం 223 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా శనివారం జరిగిన పరీక్షలకు 192 మంది విద్యార్థులు హాజరైయ్యారు. 31 మంది విద్యార్థులు గైరాజరైయ్యినట్లు చీప్ సూపరిండెంట్ ఎస్ కె హస్సన్, డీవో ఆర్ ఆమోస్ తెలిపారు.
జనరల్ విద్యార్థులు 183, ఓకేషనల్ విద్యార్థులు 40 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా జనరల్ లో 155 మంది హాజరు కాగా, ఓకేషనల్ లో 37 మంది హాజరైయ్యారు. జనరల్ లో 28 మంది గైరాజరు కాగా, ఒకేషనల్ లో ముగ్గురు విద్యార్థులు గైరాజరు అయినట్లు చీఫ్ సూపరిండెంట్ హస్సన్ తెలిపారు.