Telugu News

అక్రమ వెంచర్లను అకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.

మండలంలో అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశం విజయం పత్రిక కథనానికి స్పందన.

0

అక్రమ వెంచర్లను అకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.

మండలంలో అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశం.
విజయం పత్రిక కథనానికి స్పందన.

(కూసుమంచి – విజయం న్యూస్) :-

అక్రమ వెంచర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం విజయం పత్రికలో ప్రచురితమైన ‘గట్టుసింగారంలో రియల్ మాయ’ అనే కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ కూసుమంచి మండలంలో అకస్మికంగా పర్యటించి మండలంలోని పలు గ్రామాల్లో వేసిన వెంచర్లను పరిశీలించారు.

పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వెంచర్లను కలెక్టర్ పరిశీలించి వెంచర్ల గురించి ఎం.పి.డి.ఓ, తహశీల్దార్ లను వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూసుమంచి మండలంలో అనుమతులు లేకుండా అక్రమంగా వెలుస్తున్న వెంచర్లపై సత్వరమే చర్యలు తీసుకోవాలని, నోటీసులు జారీ చేసినప్పటికి స్పందించని వెంచర్లను తొలగించి నివేదిక సమర్పించాలని మండల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లపై గురువారం సాయంత్రంలోగా చర్యలు తీసుకోవాలని, స్పందించని వెంచర్లకు సంబంధించిన ప్రహారీలను ముఖ ద్వారాలను తొలగించాలని కలెక్టర్ మండల అధికారులను ఆదేశించారు. అయినప్పటికి స్పందించకపోతే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సూచించారు. ఎలాంటి అనుమతులు లేకుండా భూములను విక్రయిస్తే ప్రజలను మోసం చేసినట్లుగా పరిగణించాల్సి వస్తుందని, ఇప్పటికైనా అధికారులు అక్రమ వెంచర్లపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్న భూములను కొనుగోలు చేయవద్దని, తద్వారా మీరే ఇబ్బందులు పడతారని, కోరి ఇబ్బందులను కొని తెచ్చుకోవద్దని ప్రజలకు జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, కూసుమంచి తహశీల్దారు శీరీష, ఎం.పి.డి.ఓ కరుణాకర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

also read :-పేదింటి బిడ్డకు పెద్ద ర్యాంక్…

also read :-రేవంత్ రెడ్డి అద్భుత స్కెచ్..