Telugu News

రంగులు మారుతున్న పినపాక రాజకీయం

★ అధికార పార్టీలో అంతర్గత విభేదాలు...

0

రంగులు మారుతున్న పినపాక రాజకీయం

★ అధికార పార్టీలో అంతర్గత విభేదాలు…

★ ఆధిపత్యం కోసం నేతల దూకుడు..

★ వర్గ విభేదాలతో కారు నేతల మధ్య అంతర్మధనం….

★ నేతల చూపు ఎటువైపు..?

★ ఆసక్తికరంగా మారుతున్న పినపాక రాజకీయం…

★ గోడ దూకేందుకు వలస నేతల రంగం సిద్ధం …

★ రాబోయే ఎన్నికలలో కారు పార్టీ గట్టెక్కేనా …

(మణుగూరు-విజయం న్యూస్)
ఇద్దరు అధికార పార్టీ నేతలే..? ఒకరు ప్రభుత్వ విఫ్.. మరోకరు మాజీ ఎమ్మెల్యే.. గతంలో ఇద్దరు వేరువేరు పార్టీల తరుపునా పోటీ చేయగా, రాజకీయ మార్పుల కారణంగా ఇద్దరు ఒకే గూటిలో చేరారు…? చేరిన కొద్ది రోజులు పర్వాలేదనుకున్న రాజకీయ పరిణామాలు.. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా కొద్ది పినపాక రాజకీయ రూటు రోజుకో వైపు మల్లుతోంది.. రాజకీయ ముఖచిత్రం రోజుకో రంగు పులుముకుంటుంది.. ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్న ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు.. ఒకే వేదిక పైకి వచ్చిన సంఘటనలు చాలా అరుదనే చెప్పాలి.. అలా ఇద్దరి మధ్య కనిపించని వర్గపోరు బుసలుకొడుతోంది.. ఇప్పడు ఇద్దరు పోటీ చేసే యోచనలోనే ఉన్నప్పటికి సీటు సిట్టింగ్ కా..? పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారికా అర్థం కాగా అక్కడ అధికార పార్టీ నేతలు తలలుపట్టుకుంటున్నారు… సీటు సంగతేమో కానీ ఇద్దరు నేతలకు సంబంధించిన వర్గీయుల మధ్య అసలే పొసగడం లేదు.. వారిని సముదాయించడానికే అదిష్టానానికి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మరీ రాబోయే ఎన్నికల్లో అధికారపార్టీ పక్షాన బరిలో నిలిచేదేవ్వరు..? గోడదూకేదేవ్వరు..? రాబోయే ఎన్నికల్లో కారుపార్టీ గట్టెక్కేనా..? . మారుతున్న రాజకీయ అంశాలపై నిత్యం చోటుచేసుకుంటున్న పరిణామాల పై ’విజయం‘ తెలుగుదినపత్రిక అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం మీ కోసం.

also read :-వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు సంబరాలు : మంత్రి కేటీఆర్
జిల్లాలోని రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పినపాక నియోజికవర్గరాజకీయం రోజురోజుకు రంగులు మారుతుంది . 2009 నియోజకవర్గ పునర్విభజనలో నూతనంగా ఏర్పడిన పినపాక ఏజెన్సీ నియోజకవర్గంలో గిరిజనేతరుల కథనంతో పాటు అధికార టిఆర్ఎస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలతో రాజకీయం రచ్చకెక్కుతుంది. రోజురోజుకి కండవలు మార్చే నేతల దూకుడుతో నువ్వానేనా అన్నట్టుగా సాగుతున్న సమరంలో కారు పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. ఓడలు బండ్లు అవుతాయి అనే సామెతను నిజం చేస్తూ అధికార పార్టీ నేతల మధ్య అంతర్గత పోరుతో పాటు వలస నేతల వ్యవహార శైలితో అధికార పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది అనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కండువాలు మార్చే రాజకీయ నేతల వ్యవహార శైలి ఊసరవెల్లి రాజకీయాలతో పినపాక నియోజకవర్గం రోజురోజుకు రాజకీయ ప్రకంపనలు వేగంగా మారుతున్నాయి. అధికార దాహమే లక్ష్యంగా వలస నేతల రాజకీయ ప్రయాణాలతో పినపాక నియోజకవర్గం లో రాజకీయ మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయ.

వివరాలు మంగళవారం విజయం తెలుగుదినపత్రిక ఖమ్మం ఎడిషన్ లో….