రా..రామన్ని.రారా..రమ్మని
== పొంగులేటికి కాంగ్రెస్ ఆహ్వానం
== మాజీ ఎంపీతో సీఎల్పీ రహస్య చర్చలు..?
== పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎల్పీనేత భట్టి
== కలిసి పనిచేద్దామని, బీఆర్ఎస్ కు దెబ్బకొడదామని చెప్పిన వెంకట్ రెడ్డి..?
== పొంగులేటి చేరిక విషయాన్ని భట్టికి అప్పజెప్పిన అధిష్టానం
== స్పష్టం చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
== అతి త్వరలో చేరికలుంటాయన్న కాంగ్రెస్ నేత విహెచ్
== పొంగులేటి దారేటు…? ఫార్ట్ -2
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరిక నిలిచిపోయినట్లేనా..? బీజేపీ ఆగ్రనేత అమిత్ షాతో బేటి ఇక లేనట్లేనా..? ఆయన వర్గీయులు, అభిమానులు, కార్యకర్తలు కాంగ్రెస్ కు వెళ్లమని ఒత్తిడి చేస్తుంటే తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నారా..? లేదంటే కొంత సమయం తీసుకుని నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నారా..? ఆయన పునరాలోచనలో పడ్డాడా..? కాంగ్రెస్ వైపు ఆలోచిస్తున్నారా..? సీఎల్పీ నేత భట్టితో రహస్యంగా చర్చలు జరుపుతున్నారా..? కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆహ్వానం అందిందా..? అంటే నిజమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు, ఆయన వర్గీయులు. ఇప్పటికే బీజేపీ ఆగ్రనేత అమిత్ షాతో బేటి కావాల్సిన పొంగులేటి కావాలనే ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.. కొంత సమయం తీసుకుందామని ఆలోచిస్తున్న పొంగులేటి, కాంగ్రెస్ నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన చర్చలు సఫలమైయ్యాయా..? విఫలమైయ్యాయో ‘విజయం’ ప్రతినిధి అందించే ప్రత్యేక కథనం మీ కోసం..
allso read- కష్టపడి కాదు… ఇష్టపడి చదవాలి:పొంగులేటి
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పొంగులేటి చుట్టు తిరుగుతున్నాయి.. జనవరి 1న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీపై, పార్టీ అధినేతపై విమ్మర్శలు చేశారు. పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. నాతో పాటు నా పక్కన ఉన్నవారందరు పోటీ చేస్తారని, అందరు సహాకరించాలని కోరారు. దీంతో పొంగులేటి వర్గీయులు, అనుచరులందరు పార్టీని వీడారు. పొంగులేటి తో సహా అందరు ప్లెక్సిల్లో సీఎం కేసీఆర్, కేటీఆర్ పోటోలను తొలగించారు. గులాబీ కలర్ ను వదిలేసి ఇతర కలర్స్ లో ప్లెక్సిలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ రోజుతో వర్గపోరు షూరు అయ్యింది. బీఆర్ఎస్ పార్టీని వదిలేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమైయ్యాడు.
== జనవరి 18న అమిత్ షాతో బేటి ఏమైంది..?
బీఆర్ ఎస్ పార్టీ ని వీడిన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జనవరి 18న అమిత్ షాతో బేటిఅవుతారని ప్రచారం జరిగింది. అనంతరం బీజేపీ పార్టీలో చేరుతారని రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు, ప్రజలు, రాజకీయ నాయకులు భావించారు. కానీ అర్థాంతరంగా అమిత్ షాతో బేటి రద్దు అయ్యింది. ఎందుకు రద్దు అయ్యిందో తెలియదు..? అసలు అపాయిట్ మెంట్ ఉందా..? లేదా..? తెలియదు..? అది ప్రచారమే అని కొంత మంది, కచ్చితంగా అపాయింట్ మెంట్ ఇచ్చారని కొంతమంది చెబుతున్నారు. మొత్తానికి ఆయనకు కలిసే అవకాశం వచ్చిందో..? రాలేదో..? తెలియదు కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కచ్చితంగా బీజేపీలోకి పోవాలని నిర్ణయించుకున్నారు. ఈనెలాఖరు నాటికి చేరిక ఉంటుందని ఆయన వర్గీయులతో చెప్పిన పొంగులేటి అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు.
allso read- 24గంటల కరెంట్ పై చర్చకు సిద్ధమా:తాతా మదు
ఢిల్లీకి వెళ్లేందుకు ప్రత్యేకంగా విమాన వివరాలను కూడా తెలుసుకున్నట్లు సమాచారం. సుమారు 20మందితో ఢిల్లీకి వెళ్లి, అక్కడ ఢిల్లీ పెద్దలు అమిత్ షా, నడ్డాను కలిసిన అనంతరం వీలుంటే ప్రధానితో బేటి అవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ ఉన్నఫలంగా ఆయన బేజేపీ నేతలతో కలిసే అంశాన్ని విరమించుకున్నారు. అయితే ఇప్పటికి ఆయన బీజేపీకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు.
== కాంగ్రెస్ వైపు అడుగులు..?
బీఆర్ఎస్ పార్టీ అవిర్భవం అనంతరం తెలంగాణ రాష్ట్రంలో మరింతగా చేరికులుంటాయని ఆ పార్టీ నేతలు చెప్పినప్పటికి అందుకు బిన్నమైన ఫలితాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అనుచరులు, వర్గీయులు, కార్యకర్తలు, అభిమానులు అత్యధికంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నప్పటికి ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్తుంటే మాత్రం ఆపేందుకు ఎక్కువ మంది ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ పార్టీలోకి వెళ్లేందుకు పిక్స్ అయిన పొంగులేటికి ఆయన వర్గీయులు, నాయకులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభిమానులు, ప్రజలు కోరుతున్నారు. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు వందలాధి మందితో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఒక్కోక్కర్ని అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్న పొంగులేటి పినపాక, ఇల్లందు, వైరా నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తలు, అభిమానుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు.
allo read- శీనన్న ఆ గట్టునా..? ఈ గట్టునా..?
అయితే ఎక్కడ సమావేశాలు నిర్వహించిన, ఎవరితో మాట్లాడిన అందులో 80శాతం మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని పొంగులేటికి సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా పొంగులేటికి ప్రధాన అనుచరులైన మట్టా దయానంద్, అధినారాయణ లాంటి వారు సైతం కాంగ్రెస్ కు వెళ్తేనే బాగుంటుందని, బీజేపీలోకి వెళ్తే మేము మీతో రాలేమని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో పునారలోచనలో పడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరికల విషయాన్ని నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది.
== రా..రామ్మని
బీఆర్ఎస్ పార్టీకి దూరమైన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ‘చేయీ’తనందించేందుకు సిద్దమైంది. అందుకు గాను ఏఐసీసీ నుంచి గల్లి వరకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆహ్వానం పలుకుతోంది. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ లో నేరుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ లోకి అహ్వానిస్తున్నామని ప్రకటించారు. కలిసి పనిచేసి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టిని ముందుకు తీసుకెళ్దామని కోరారు. మరసటి రోజున ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లోకి రావాలని కోరారు. అంతటితోనే పూర్తి కాక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి అహ్వానించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, అందులో అనుమానపడాల్సిన అవసరం లేదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కలిసి పనిచేసేందుకు, ఆయనకు గౌవరం నిలిచే పదవిని అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ముందున్నదని తెలిపారు. ఇక మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంత్ రావు పొంగులేటి కాంగ్రెస్ బిడ్డా, తిరిగి పుట్టింటికి రావడం ఖాయమంటూ ప్రకటించారు. అలాగే నల్గొండ ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇలా ముకుమ్ముడిగా పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని పిలవడం ఆశ్ఛర్యకరంగా ఉంది.
== భట్టితో రహస్య చర్చలు..?
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతలను ఏఐసీసీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అప్పగించారు. నచ్చజెప్పి, మాటిచ్చి ఆయన్ను పార్టిలోకి తీసుకరావాలని ఏఐసీసీ ఆగ్రనేత రాహుల్ గాంధీ పోన్ ద్వారా సీఎల్పీ నేత భట్టికి బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవం రోజున స్వయంగా చెప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆయన ద్వారా మరింత బలపడుతుంది. అందుకే ఏఐసీసీ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
allso read- 24గంటల్లో న్యాయం చేయాలి..లేకుంటే స్టేషన్ కు వస్తా: పొంగులేటి
అయితే ఆయన బాధ్యతలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అప్పగించాము. ఆయన మాట్లాడుతున్నారని బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఈ విషయంపై విజయం ప్రతినిధి ఆరా తీయగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేరుగా కాకుండా పోన్లో సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఆయనతో చర్చలు జరిగినట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతుంది. కుర్చోని మాట్లాడేందుకు సిద్దంగా ఉన్నామని భట్టి విక్రమార్క, పొంగులేటితో చెప్పినట్లుగా సమాచారం. కావాల్సిన అంశాలపై చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని, అవసరమైతే రాహుల్ గాంధీతో బేటికి అవకాశం కల్పిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొంత సమయం కావాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..?