Telugu News

నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటి కాంటాక్ట్ ప్రోగ్రామ్ : ఏసీపీ సారంగపాణి

= కిష్టంపేట గ్రామంలో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

0

నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటి కాంటాక్ట్ ప్రోగ్రామ్ : ఏసీపీ సారంగపాణి
== కిష్టంపేట గ్రామంలో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు
== భారీగా హాజరైన పోలీసులు.. కాగితాలు లేని వాహనాలను సీజ్
(పెద్దపల్లి – విజయం న్యూస్):
పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి (ఐ.పి.ఎస్) ఆదేశానుసారం పెద్దపల్లి ఏసిపి సారంగపాణి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టంపేట గ్రామంలో “కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్” కార్యక్రమం (సిసిపి) నిర్వహించారు. గ్రామంలో తనిఖీ లు నిర్వహించి 26ఎలాంటి పేపర్లు లేని మోటార్ సైకిళ్లను, 04 ఆటోలను, 2 ట్రాక్టర్ లను సీజ్ చేసినారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ మాట్లాడుతూ…ప్రజలు రక్షణ పరంగా తీసుకోవలసిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.ప్రజల రక్షణ గురించి ప్రజలకు భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి, ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని, గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేర రహిత బస్తిలుగా, గ్రామలుగా చేయలనే ఉద్దేశ్యం గురించి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపినారు. నేనుసైతం అనే కార్యక్రమం ద్వారా గ్రామాలలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు, సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన అమాయకులైన ప్రజలను కేసుల నుండి రక్షించవచ్చని, గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చునని అన్నారు.కోవిడ్ ఒమిక్రాన్ రూపంలో మళ్లీ విజంభిస్తున్నా దృష్ట్యా అందరూ మాస్క్ ధరించి కోవిడ్ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్, డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలనికోరారు.ఎలాంటి పత్రాలు లేని వాహనాలు నడపవద్దని నడిపేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ఈ మధ్యకాలంలో హెల్మెట్ లేక కొందరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిందని, హెల్మెట్ భారంగా కాకుండా బాధ్యతగా భావించి ధరించాలని సూచించారు.పాత వాహనాలు కొనేటప్పుడు వాటి యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని కొనాలని, డాక్యుమెంట్స్ లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని అన్నారు. గ్రామం లో చుట్టుపక్కల గ్రామంలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి, గుడుంబా,గుట్కాలు అమ్ముతున్నా, పేకాట ఆడిన వారి సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలపాలని లేదా డయల్ 100 కు ఫోన్ చేసినచో వెంటనే చర్యలు పడతామని,యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచిగా చదువుకొని వారి తల్లిదండ్రులకు, వారి ప్రాంతానికి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.

తరచుగా గ్రామాలలో పట్టణాలలో కాలనీలలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ రోజు స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులు వాటికి సంబంధించిన పత్రాలు చూపించిన తర్వాత తిరిగి వారి వాహనాలను వారికే అప్పగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో సుల్తానాబాద్ సిఐ ఇంద్ర సేన రెడ్డి , కాల్వశ్రీరాంపూర్ ఎస్సై వెంకటేష్, సుల్తానాబాద్ ఎస్సై ఉపేందర్ రావు, జూలపల్లి ఎస్సై వినీత, ధర్మారం ఎస్సై అశ్విని, పెద్దపల్లి ఎస్ఐ లు రాజవర్ధన్, సహదేవ్‌సింగ్, పొత్కపల్లి ఎస్ ఐ లక్ష్మణ్, 80 మంది సిబ్బంది పాల్గొన్నారు.

also read :-ప్రజల భద్రతకు భరోసా కోసమే కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం: ఏఎస్పీ