Telugu News

నేడే ఖమ్మంలో జరిగే టియుడబ్ల్యూజే జిల్లా మహాసభకు తరలిరాండి

జర్నలిస్టులకు జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ పిలుపు

0

నేడే టియుడబ్ల్యూజే జిల్లా మహాసభ

— భారీగా తరలిరండి

— జర్నలిస్టులకు జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ పిలుపు

 ఖమ్మం, డిసెంబర్ 17(విజయంన్యూస్):

 తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీజేఎఫ్) ఉమ్మడి ఖమ్మం జిల్లాల 3వ మహాసభలు ఆదివారం ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ గార్డెన్ లో జరగనుందని టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో శనివారం జరిగిన జర్నలిస్టు ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుండి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

ఇది కూడా చదవండి: జర్నలిస్ట్ జానిపాషాకు సత్కారం…

ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. ఎంతో గొప్పగా జరగనున్న ఈ మహాసభలకు జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆకుతోట ఆదినారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెన్నబోయిన సాంబశివరావు, బొల్లం శ్రీనివాస్, చిర్రా రవి, రామకృష్ణ ఉపేందర్, సంతోష్, గుద్దేటి రమేష్ బాబు, బాలబత్తుల రాఘవ,  యలమందల జగదీష్, అమరవరపు కోటేశ్వరరావు, టీఎస్ చక్రవర్తి, పిన్నెల్లి శ్రీనివాస్, కొరకొప్పుల రాంబాబు, జానీపాషా, కెవి, సంతోష్, అశోక్, ఉత్కంఠం శ్రీనివాస్, మెట్రో నాగేశ్వరరావు, గోపి, శ్రీధర్, మోహన్, వెంకట్ రెడ్డి, కృష్ణ, రవి, జీవన్ రెడ్డి, పానకాలరావు, వెంపటి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: షర్మిళ నీ బాష మార్చుకో: తాతామధు