Telugu News

దుబాయ్ నుంచి వచ్చి.. అంబేద్కర్ కు నమస్కరించి

== అంబేద్కర్ కు నివాళ్లు అర్పించిన "కర్లపుడి అంబెడ్కర్

0

దుబాయ్ నుంచి వచ్చి.. అంబేద్కర్ కు నమస్కరించి

== అంబేద్కర్ కు నివాళ్లు అర్పించిన “కర్లపుడి అంబెడ్కర్”

(ఖమ్మం-విజయం న్యూస్);-

దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు.. చాలా రోజుల తరువాత ఖమ్మం తిరిగి వచ్చాడు.. ఖమ్మంలో స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులు, బందువులు, స్నేహితులు అందరు వేచి చూస్తున్నారు.. అంతలో ఆయన నేరుగా జడ్పీసెంటర్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి పూలమాల వేసి నివాళ్లు అర్పించాడు. అంబేద్కర్ పాదాలను ముద్దాడాడు. దీంతో అందరు అశ్ఛర్యపోయారు.. అయనేవరో కాదు.. ఆయన అంబేద్కరుడే. నమ్మలేరా..? ఆయన పేరు కె.వి. అంబేద్కర్. సీనియర్ నాయకులు కె.వీ రత్నం కుమారుడు కె.వి అంబేద్కర్. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం పురప్రముఖులు కె.వి. రత్నం కుమారుడు “కర్లపుడి అంబెడ్కర్” ఇప్పటివరకు దుబాయ్ లో ఉద్యోగం చేస్తూ ఖమ్మం వచ్చిన సందర్భంగా పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో గల 14 అడుగుల భారత రత్న డా. బి.ఆర్. అంబెడ్కర్ కాస్య విగ్రహం చూసి, ఏ పట్టణంలో లేని ఎత్తైన బాబాసాహెబ్ విగ్రహం చూసి ఆయన ఆ విగ్రహం వద్ద నివాళ్లు అర్పించారు. విగ్రహం ఏర్పాటు చేసిన వివరాలను అడిగి తెలుసుకున్న అంబేద్కర్, రవాణా శాఖ మాత్యులు పువ్వాడ. అజయ్ కుమార్ కొనియాడారు. ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు.

also read;-ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవం……

ఈ సందర్భంగా “కర్లపూడి అంబెడ్కర్” మాట్లాడుతూ దుబాయ్ లో 5 లక్షల మంది తెలుగు వారు వివిధ ఉద్యోగాలు చేస్తున్నారని, అక్కడ తెలుగు అసోసియేషన్, తెలంగాణ అసోసియేషన్ కమిటీల ఎగ్జిగ్యూటివ్ మెంబర్ గా పనిచేస్తున్నట్లు, దుబాయ్ లో కూడా భారత రత్న డా.బి.ఆర్.అంబెడ్కర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు కర్లపూడి. అంబెడ్కర్ స్పష్టం చేశారు. తాను రానున్న కాలంలో ఖమ్మం జిల్లాలో సామాజిక మార్పుకోసం పనిచేయటానికి రానున్నానని “అంబెడ్కర్” ప్రకటించారు. తెలంగాణ లోని అన్ని పట్టణాలలో ఇలాంటి 14 అడుగుల ఎత్తు ఉన్న కాస్య అంబెడ్కర్ విగ్రహాలు ఏర్పాటుచేయాలని మంత్రికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి భారతీయుడు అంబెడ్కర్ గారి ఆశయాలను నెరవేర్చటానికి సంసిద్ధులు కావాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని, సంక్షేమ ఫలాలు అందరికి అందాలని పేదల జీవన విధానానికి చేయూత నివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో “యూనీటి ఆఫ్ మాల” జిల్లా అధ్యక్షులు కందుల. ఉపేందర్, ప్రధాన కార్యదర్శి గుమ్మడి. కనకరాజు, స్టిరింగ్ కమిటీ సభ్యులు సి.హెచ్. కోటేశ్వరరావు, జి.ఎల్లయ్య, సి.హెచ్. కనకయ్య, ఎం.శౌరీ, బి. జి. క్లైమెంట్ గారు, ఎస్ లక్ష్మయ్య, టి.రామారావు, పి.వెంకటేశ్వర్లు, జి. రాజు, డి. రవికుమార్, ఎన్ రమేశ్ “పే బ్యాక్ టు సొసైటీ” నుండి జె. లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.