త్వరలో టీఆర్ఎస్ లో ఖమ్మం జిల్లా యువతెలంగాణ పార్టీ విలీనం
** జిల్లా అధ్యక్ష పదవికి జక్కుల వెంకటరమణ రాజీనామ
త్వరలో టీఆర్ఎస్ లో ఖమ్మం జిల్లా యువతెలంగాణ పార్టీ విలీనం
** జిల్లా అధ్యక్ష పదవికి జక్కుల వెంకటరమణ రాజీనామ
** ఈ నెల 18న మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో చేరికకు రంగం సిద్దం
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
యువతెలంగాణ పార్టీకి ఆ పార్టీ నాయకులు స్వస్తీ పలకనున్నారు.. ఇప్పటి వరకు యువతెలంగాణ పార్టీని నడిపించిన పార్టీ అధ్యక్షుడు జక్కుల వెంకటరమణ ఆ పార్టీని వీడీ టీఆర్ఎస్ లో చేరనున్నారు. అంతేకాదు ఖమ్మం జిల్లాకు సంబంధించిన పార్టీని పూర్తిగా టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయనున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇటీవలే ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పార్టీని బీజేపీలో విలీనం చేసే కార్యక్రమంను ఖమ్మం జిల్లా కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇటీవల పార్టీ ఖమ్మం జిల్లా కమిటి సమావేశం జరిగింది.
also read :-కాబోయే అల్లుడికి 365 వంటలతో….. ఆతిథ్యం
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కమిటీని పూర్తిగా టీఆర్ఎస్ లో విలీనం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో జనవరి 18వ తేదీన సాయంత్రం 4గంటలకు టి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో చేరాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి వేలకోట్ల రూపాయల నిధులు రప్పించి, జిల్లా అభివృద్ధికి అహర్నిశలూ కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఖమ్మం ను అగ్రభాగాన నిలుపుతున్న జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై యువతెలంగాణ జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ ఇతర జిల్లా నాయకులు, కార్యకర్తలు తెరాస పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు ముహుర్తం ఖరారు కాగా, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నారు.