Telugu News

కామాందుడు వనమా రాఘవకు ఉరిశిక్ష విధించాలి.

** ఆడబిడ్డలంటే అంత అలుసా ఆయనకు

0

కామాందుడు వనమా రాఘవకు ఉరిశిక్ష విధించాలి
** ఆడబిడ్డలంటే అంత అలుసా ఆయనకు
** సమాజమే సిగ్గుపడే విధంగా వ్యవహరించారు
** ఇలాంటివారిని కఠినంగా శిక్షించాల్సిందే
విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు డి.సౌజన్య
(ఖమ్మం-విజయంన్యూస్);-
రామకష్ణ కుటుంబ ఆత్మహత్య విషయంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రకు ఉరిశిక్ష విధించాలని, అలాంటి నీచమైన నాయకులను సమాజంలో ఉంచితే ఇంకా సమాజం పాడవుతుందని, అందుకే అలాంటి నాయకుడ్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైన ఉందని మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు డి. సౌజన్య పోలీసులను డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పాత పాల్వంచ లో ఇటీవలే జరిగిన రామకష్ణ కుటుంబం ఆత్మహత్య సంఘటన చాలా బాధాకరమని, రామకష్ణ పెట్టిన వీడియో చూసిన తరువాత మహిళగా చాలా సిగ్గుపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రామకష్ణ ఆత్మహత్యకంటే ముందు పెట్టిన వీడియో కన్నీరు తెప్పించిందని అన్నారు.

also read;-రికార్డ్ స్థాయిలో పత్తి ధర..

నాకేమి సంబంధం లేదని నంగనాసి మాటలు మాట్లాడిన వనమా రాఘవ వీడియో చూసిన తరువాత ఏం మాట్లాడతారో చూడాలని ఉందని అన్నారు. అలాంటోల్లు ఈ సమాజానికి అవసరమా..? అని ప్రశ్నించారు. చీరకట్టుకు, మహిళలను గౌరవించే భారతవనిలో ఉన్న మనం అలాంటి మహిళను పక్కలోకి పంపించమని భర్తనే అడగడం అంటే ఎంత దాష్టికంగా వనమా రాఘవ వ్యవహరిస్తున్నాడో అర్థమవుతుందని అన్నారు. ఈ ఒక్క సంఘటనే కాకుండా ఎస్ఐ భార్యపైఅత్యాచారం చేసినట్లు కూడా తెలుస్తోందని,గతంలో కేసు పెట్టిన ఎస్ఐని పట్టించుకోకపోవడం వల్ల తన తుపాకితోనే కాల్చుకుని చచ్చిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.

also read;-రైతు రాజ్యం కాంగ్రెస్ తోనే సాధ్యం : శివకుమార్

బయటకు వచ్చినవే కాకుండా బయటకు రాకుండా ఉన్న సంఘటనలు చాలా ఉన్నాయని, ఇలాంటి కామాందుడ్ని నేరుగా కాల్చిపడేయాలనే కోపం వస్తుందని ఆమె దుయ్యబట్టారు. పోలీసులు పక్షపాతం వహిస్తున్నారని, నాలుగు రోజుల నుంచి ఆయన్ను అరెస్టు చేయలేదని చెప్పడం రాష్ట్ర పోలీసులు అధికారానికి ఎలా కొమ్ముకాస్తున్నారో అర్థమవుతుందన్నారు. ప్రతిపక్షపార్టీల నాయకులను క్షణాల ముందు అరెస్టు చేసే పోలీసులు, దేశంలో బెస్ట్ పోలీసులమని చెప్పుకుంటున్న పోలీస్ శాఖ వనమా రాఘవ విషయంలో ఎక్కడికిపోయిందని ఫ్రశ్నించారు. తక్షణమే వనమా రాఘవాను అరెస్టు చేసి, ఆయన్ను కఠినంగా శిక్షించాలని, తద్వరా రామకష్ణ కుటుంబాన్ని అదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళ కార్పోరేటర్లు మిక్కిలేని మంజుల, ఎండీ.రఫీధాబేగం తదితరులు పాల్గొన్నారు.