భరోసా కోసమే కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం – ఏసీపీ (కల్లూరు వేంకటేశ్)
ప్రజల భద్రతకు భరోసా కోసమే కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కల్లూరు ఏసీపీ వేంకటేశ్ అన్నారు.
భరోసా కోసమే కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం: ఏసీపీ
ప్రజల భద్రతకు భరోసా కోసమే
కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు
కల్లూరు ఏసీపీ వేంకటేశ్ అన్నారు.
(ఖమ్మం – విజయం న్యూస్):-
పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు కల్లూరు డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున కల్లూరు మండలం శాంతినగర్ కాలనీలో తనిఖీలు నిర్వహించారు.
ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సరైన ధ్రువ పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా కల్లూరు ఏసీపీ మాట్లాడుతూ…కమ్యూనిటీ కనెక్ట్ ద్వారా నేరరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
అందులో భాగంగా స్ధానిక ప్రజలకు ఎలాంటి అభద్రత భావం లేకుండా ఇలాంటి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలపై, నేరస్తుల కదలికపై నిరతరం నిఘా ఉంటుందన్నారు.
స్దానికంగా ఏలాంటి గొడవలకు పోకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో వుండాలని సూచించారు.
స్దానిక ప్రాంతాలలో ప్రజల స్వచ్ఛందంగా భాగస్వామ్యమై ముఖ్యమైన కూడలిల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అక్రమ సంపాదనకు అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్న మాయగాళ్ల మాటలు నమ్మి మోస పోవద్దని అన్నారు.
ఆన్లైన్ సైబర్ నేరగాళ్ల నుండి అప్రమత్తంగా వుండాలని, మీ బ్యాంక్ ఖాతా వివరాల కోసం వచ్చే కాల్స్, ఈమెయిల్స్ కు స్పందించవద్దని సూచించారు.
ఎలాంటి అత్యవసర సమయంలో అయిన డయల్ వందకు లేదా స్దానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు.
కార్యక్రమంలో సత్తుపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ టీ కరుణాకర్, సత్తుపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ , కల్లూరు ఎస్సై కర్రీ వెంకటేష్, వి ఎం బంజర్ ఎస్ఐ శ్వేత వేంసూర్ ఎస్ఐ ఎమ్ విజయ్ కుమార్, ఏన్కూరు ఎస్సై సాయి కుమార్, సత్తుపల్లి ఎస్ ఐ శ్రీ రామ్ నాయక్, మరియు అరవైఏడు మంది సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
also read :- ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ : ఒమిక్రాన్.