కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి
== ఉద్యోగం కోసం మా అక్క,బావ నన్ను చంపేసే అవకాశం ఉంది
== నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు
== ట్విట్టర్, పెస్ బుక్ లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు లేఖ రాసిన బాలుడు
== నెట్టింట్లో వైరల్ గా మారిన బాలుడి లేఖ
(ఖమ్మం-విజయంన్యూస్)
నేను అనాథను.. నా తల్లిదండ్రులు చనిపోయారు.. ఉద్యోగం కోసం మా అక్క,బావ నన్ను చిత్ర హింసలకు గురిచేస్తున్నారు.. నేను హత్యచేయాలని అనుకుంటున్నారు.. అంతకంటే ముందు నేనే చనిపోతా..? నాకు కారుణ్య మరణానికి అనుమతినివ్వండి అంటూ ఓ బాలుడు సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు లేఖ రాశారు. ఆ లేఖను ఎలా పంపించాలో తెలియక నెట్లో పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్ గా మారింది.. నెట్లో నెటిజన్లు ఆ బాలుడికి అండగా ఉంటామని భరోసానిస్తున్నారు.. అసలు విషయమేమిటి..? ఎందుకు ఆ బాలుడు కారుణ్య మరణానికి సీఎం కేసీఆర్ కు లేఖ రాశాడో..? చూడాలనుకుంటే..?
also read :- బూడిదంపాడు గ్రామంలో నామ పర్యటన
ఈ కింది వివరాలను పూర్తిగా చదవాల్సిందే. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన గొరంట్ల సాయిచంద్(17) అనాధగా జీవనం సాగిస్తున్నాడు. ఆయన తల్లిదండ్రులు చనిపోగా, ఆయనకు ఒక అక్క ఉంది. ఆమె హుజుర్ నగర్లోని అంబేద్కర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే సాయిచంద్ తండ్రి లక్ష్మినారాయణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ 2005లో చనిపోయారు. ఆయన స్థానంలో కారుణ్య నియామకం ద్వారా ఆయన భార్య సాయిచంద్ తల్లి ఉధ్యోగం చేస్తుంది. అయితే 2014లో తల్లిని అక్క ఇంటికి తీసుకెళ్లి పెంచుకుంటుండగా కరోనాతో చనిపోయింది. దీంతో ఆమె ఉద్యోగం కారుణ్య నియామకాల ద్వారా మరోకరి కి రావాల్సి ఉంటుంది. ఆ ఉద్యోగంపై కన్నేసిన సాయిచంద్ అక్క, బావ సమయం కోసం వేచి చూస్తున్నారని తెలిపారు.
ఉద్యోగం కోసమే మా అమ్మను కావాలనే హత్య చేశారని, కానీ కరోనా వల్ల చనిపోయినట్లు క్రియేట్ చేసి నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. నేను నమ్మకపోవడంతో నన్ను బెదిరించి, నీకు ఎవరు లేరు, నిన్ను కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారని లేఖలో పేర్కోన్నాడు. దీంతో భయపడిపోయి నేను నేలకొండపల్లి వచ్చానని, మా మేన మామల వద్ద ఉంటున్నానని తెలిపారు. ఈ తరుణంలో చదువులకు ఇబ్బంది కల్గోద్దని నేలకొండపల్లి గ్రామంలోని మ ఓ అంకుల్ సహాయంతో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ చదువుకుంటున్నానని అన్నారు. అయినప్పటికి మా అక్క, బావ నన్ను చిత్రహింసలు, మానసిక వేదనకు గురి చేస్తున్నారని తెలిపాడు. అక్కకు ఉద్యోగం వచ్చే విధంగా ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెట్టాలని, లేకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నాడని లేఖలో పేర్కొన్నాడు. ఇప్పటికే మా ఇంట్లో ఉన్న బంగారం, సామాగ్రి మొత్తం తీసుకెళ్లారని, కనీసం వండుకునే పాత్రలు కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
also read :-గ్రంథాలయాలే… ఆధునిక దేవాలయాలు!
నా దగ్గర ఇప్పుడు నాకు సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా లేకుండా చేశారని, నా వద్ద ఎలాంటి ఆధారం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నేను ఇప్పుడు డోనేషన్లతో చదువుకుంటున్నానని తెలిపారు. ఇన్నాళ్లు తల్లి చాటు బిడ్డలా బ్రతికినా నాకు ఇంత చిన్న వయసులో అనుభవం లేని వయసులో ఒకేసారి ఇన్ని సమస్యలు రావడంతో ఇక నా బతుకు నాకే భారం కావడంతో ఆత్మహత్య చేసుకునే ధైర్యం కూడా లేకపోవడంతో నేను ఈ కారుణ్య మరణాన్ని కోరుకుంటున్నానని తెలిపారు. నా ఈ మరణానికి కారకులవుతున్నా నా అక్క బావ, మా బావ తల్లితండ్రులు గుండా శివప్రసాద్ పద్మ లపై చర్యలు తీసుకుని, నా ఈ కారుణ్య మరణానికి సంబంధించిన అనుమతిని ఇప్పించుటకు కోరుతున్నాని లేఖలో రాశాడు.
== గ్రూపులలో వైరల్ గా మారిన పోస్టు
బాలుడు సాయిచంద్ పోస్టు చేసిన వీడియో, సీఎం కేసీఆర్, కేటీఆర్ కు రాసిన లేఖ పెద్ద వైరల్ గా మారింది. నెట్టింట్లో పరుగులు పెడుతోంది. సీఎం కేసీఆర్ వద్దకు చేరే విధంగా ఈ పోస్టును పార్వోర్డు చేయాలని చెప్పడంతో ఆ పోస్టును చూసిన ప్రతి ఒక్కరు గ్రూపులలో పోస్టు చేస్తున్నారు. దీంతో నెటిజన్లు సాయిచంద్ అనాథగా ఉన్న సమయంలో అక్కున చేర్చుకోవాల్సిన అక్క,బావలు ఇలా చేయడమేంటని వారిపై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి అక్క, భావలు సమాజానాకి అవసరమా..? అంటూ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారా..? వేచి చూడాల్సిందే..? మరీ.