తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలి: ఎండీ జావిద్
వర్షానికి మొక్కజొన్న వరి తడవకుండా నల్ల పట్టాలు అందజేయాలి
తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలి: ఎండీ జావిద్
== కల్లాల్లో ఉన్న మొక్కజొన్నను మద్దతు ధరతో వెంటనే కొనుగోలు చేయాలి
== వర్షానికి మొక్కజొన్న వరి తడవకుండా నల్ల పట్టాలు అందజేయాలి
== పంట నష్ట పోయిన రైతుల్ని పరామర్శ
== నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్.
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
అకాల వర్షానికి తడిసిన ధాన్యం విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వ ప్రతినిధులు కనికరం లేకుండా మాట్లాడుతున్నారని, తక్షణమే నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని పీసీసీ సభ్యులు, ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ జావిద్ డిమాండ్ చేశారు. రఘునాథపాలెం మండలంలోని కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. మహ్మద్ జావిద్ రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ:జావిద్
ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు పిసిసి మెంబర్ మొహమ్మద్ జావిద్ మాట్లాడుతూ అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇతర రాష్ట్రాలు వెళ్లి ఇవ్వడం కాదని చెప్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చుకున్నటువంటి తెలంగాణలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఎప్పుడు వర్షం వస్తదో అని రైతులు బిక్కుబిక్కుమంటున్నారు 25 రోజుల క్రితం బోనకల్ మండలంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇంతవరకు రైతుల ఖాతాలో జమ కాలేదని తక్షణమే ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చెల్లించాలని గణేశ్వరంలో పర్యటించి అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. చేతికి వచ్చిన పంట అకాల వర్షాలతో దెబ్బతిని రైతులకు శోకాన్ని మిగిల్చిందని అన్నారు.సీఎం కేసీఆర్ అఘమేగల మీద వచ్చి నష్ట పరిహారం ప్రకటించి నేటికీ నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు. రైతుల పట్ల కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని అన్నారు. ఒకపక్క రైతులు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఎన్నికల హడావుడి మొదలు పెట్టారని అన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు దాన్యం అమ్ముకునే దగ్గర కూడా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మార్క్ ఫెడ్ ను ప్రారంభించి మొక్కజొన్న, వరి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: పోరాట పటిమ ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి: జావిద్
అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నష్టపరిహారం బాదిత రైతుల ఖాతాలో జమ అయ్యేల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు నల్ల పట్టాలు అందజేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో 2 వ డివిజన్ కార్పొరేటర్ మలిదు వెంకటేశ్వర్లు, రఘునాథ పాలెం మండల అధ్యక్షులు భూక్యా బాలాజీ, కొంటేముక్కల నాగేశ్వరరావు, వేపకుంట్ల గ్రామ మాజీ సర్పంచ్ రేమల్లే రమేష్, కిలారు వెంకటరమణ, గ్రామ నాయకులు కొర్ర కృష్ణ, భూక్యా రమణ, కొర్ర రమణ ,భూక్యా మగిత్యా, బాదావత్ మంగి లాల్, ధరంసోత్ నరసింహారావు, కొర్ర ఉపుల్లయ్య, బాదావత్ పంతుల, జోగు శ్రీను, తేజావత్ పుల్లయ్య, తేజావత్ వీరన్న ,తదితరులు నాయకులు పాల్గొన్నారు.