Telugu News

తుమ్మల “ఖమ్మం” లో పోటీ..?

ఖమ్మం పంపించేందుకు కాంగ్రెస్ నిర్ణయం..?

0

తుమ్మల @ ఖమ్మం తుమ్మల “ఖమ్మం” లో పోటీ..?

== పాలేరు టిక్కెట్ పైనే తుమ్మల గురి..?

== ఖమ్మం పంపించేందుకు కాంగ్రెస్ నిర్ణయం..?

== ఖమ్మంలో గెలుపు తథ్యమని భావిస్తున్న అధిష్టానం

== ఖమ్మంలో తుమ్మల పోటీ చేయాలని కోరుతున్నా సామాజిక వర్గం

== 20 లేదా 22న ఖమ్మంకు తుమ్మల..?

== భారీగా స్వాగత ఏర్పాట్లు..నాయకన్ గూడెం నుంచి భారీ స్వాగతం.?

== పస్ట్ ఈజీ బెస్ట్ ప్రోగ్రామ్ గా ఏర్పాట్లుండే అవకాశం

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది… కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నియోజకవర్గ టిక్కట్ తుమ్మలకు దాదాపుగా ఖాయమైనట్లు గాంధీభవన్ నుంచి సమాచారం.. ఎక్కడ పోగొట్టుకున్నామో..అక్కడే దొరకబట్టాలనే సామేతను పట్టువీడని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు టిక్కెట్ ఇవ్వాలని తన డిమాండ్ ను కాంగ్రెస్ అదిష్టానం ముందు పెట్టగా, టిక్కెట్ కేటాయిస్తామనే హామిమేరకు ఆయన పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.. అందుకే పాలేరు కావాలనుకున్నప్పటి సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఖమ్మం టిక్కెట్ @ తుమ్మల నాగేశ్వరరావు అన్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్‌కు అధికారం ఖాయం: సోనియా

ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించి ఇప్పటి వరకు ఖర్చు చేసి కార్యకర్తలకు అండగా ఉన్న నాయకులు కొంత నిరాశ చెందినప్పటికి పార్టీ అధిష్టానం పై నమ్మకం ఉందని, మాకే టిక్కెట్ వస్తుందని ఆశిస్తున్నారు.  .. పాలేరు నియోజకవర్గ రాజకీయ పరిణామాలపై రాజకీయ విశ్లేషణాత్మక కథనం..

(కూసుమంచి-విజయంన్యూస్)

కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న  ఖమ్మం నియోజకవర్గం.. మొదటి నుంచి ఓ సామాజిక వర్గానికి కేంద్రంగా మారింది.. 1952 నుంచి ఖమ్మంకు 17 మంది  ఎమ్మెల్యే లు పనిచేయగా అందులో 80శాతం మంది ఎమ్మెల్యేలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మొత్తం 16సార్లు ఎన్నికలు జరగ్గా అందులో 1952 నుంచి 57వరకు పీడీఎఫ్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ తరువాత 1959 నుంచి 2018 వరకు మొత్తం 15 సార్లు ఎన్నికలు జరగ్గా అందులో  సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు నాలుగు సార్ల చొప్పున గెలిచారు. టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కొక్క సారి విజయం సాధించాయి.

ఇది కూడా చదవండి:- నరేంద్రమోడీని ప్రశ్నిస్తే కేసులే: రాహుల్

కమ్యూనిస్టుల పరంగా చూస్తే 8సార్లు వాళ్ళే ప్రాతినిధ్యం వహించారు. అందులో రజబ్ అలీ,యూనిస్ సుల్తాన్, అనంత రెడ్డి మినహా అందరూ ఖమ్మం సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యే లు పని చేశారు. నల్లమల గిరిప్రసాద్, రాంకిషన్ రావు, పువ్వాడ నాగేశ్వరరావు, తమ్మినేని వీరభద్రం, తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్ ఇలా అందరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.

== కమ్మ వర్సెస్ కమ్మ

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చాలా లాజిక్ ను ప్రదర్శిస్తుందనే చెప్పాలి. కర్నాటక లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ తా వ్యూహాత్మకంగా ముందుకు సాగిందో..అదే స్టాటజీని తెలంగాణలో అమలు చేసే అవకాశం కన్పిస్తోంది. అందుకే ప్రత్యర్థి సామర్థ్యం, సామాజిక వర్గాన్ని అంచనా వేసి టిక్కెట్ లు కేటయించే అవకాశం ఉంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో కూడా అదే స్టాటజీని ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి:- తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ: రాహుల్

ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరులో రెడ్డి, ఖమ్మం లో కమ్మ, కొత్తగూడెం లో బీసీ అభ్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ లకే టిక్కెట్లు ఇచ్చింది. అందులో భాగంగానే ఖమ్మం నియోజకవర్గం అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని పెట్టాలని భావిస్తోంది.

== 10మంది దరఖాస్తులు 

       జనరల్ స్థానమైన ఖమ్మం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి  పోటీ చేసేందుకు మొత్తం 10 మంది ఆశావాహులు  దరఖాస్తు చేసుకున్నారు. మహ్మద్ జావిద్, చోటా బాబా, మానుకోండి రాధా కిషోర్, పరుచూరి మురళి కృష్ణ, లోకేష్ యాదవ్, పుచ్చకాయల వీరభద్రం, నున్నా రామకృష్ణ, ఇటీవలే పార్టీ మారిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మువ్వా విజయ్ బాబు కాంగ్రెస్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో  పార్టీని నమ్ముకుని పదేళ్ళుగా పార్టీ కోసం పనిచేసిన వారికో  ఎవరికో ఒకరికి  టిక్కెట్ వస్తుందని వారు ఆశించారు.

ఇది కూడా చదవండి:- ఆరు గ్యారంటీ స్కీమ్ లను ప్రకటించిన రాహుల్ గాంధీ

మహామ్మద్ జావిద్, మానుకోండ రాధా కిషోర్, చోటా బాబా, నున్నా రామకృష్ణ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. మహ్మద్ జావిద్ కు టిక్కెట్ కన్ఫామ్ అని గత పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతూ కష్టకాలంలో పార్టీని, నమ్మిన కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చాడు. మొన్నటి వరకు జావిద్ టిక్కెట్ కన్ఫామ్ అని అనుకున్నారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక కొంత  కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. పొంగులేటి లేదంటే మువ్వా విజయ్ బాబుకు టిక్కెట్ అని ప్రచారం జరిగింది.. మువ్వా విజయ్ బాబు ఇప్పటికే నియోజకవర్గంలో వాడవాడకు కాంగ్రెస్ పేరుతో తిరుగుతున్నారు. అయితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అండదండలు ఉన్న జావిద్ కు కచ్చితంగా టిక్కెట్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంలో

== తుమ్మలకే టిక్కెట్..?

ఖిమ్మం యోజకవర్గంలో మొత్తం 10 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకోగా, అసలు దరఖాస్తు చేసుకోకుండా ఉన్నఫలంగా తెరపైకి వచ్చిన నేత  తుమ్మల నాగేశ్వరరావు. ఆయన పార్టీలో చేరడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి..

ఇది కూడా చదవండి:- బీజేపీ, బీఆర్ఎస్,ఎంఐఎం పార్టీల ఆత్మ ఒక్కటే: రాహుల్

బీఆర్ఎస్ పార్టీ నుంచి పాలేరు టిక్కెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తన బల నిరూపణ చేసి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. జిల్లాకు చేరిన మొదటి రోజున జరిగిన మీడియా సమావేశంలో  కచ్చితంగా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే రాజకీయ పరిణామల ఫలితంగా  కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ మాణిక్యారావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడి రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎన్నికల ప్రచార కమిటీకో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో సహా జిల్లా ముఖ్యనాయకులందరు తుమ్మలను కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరారు. దీంతో ఆయన తన డిమాండ్ ను కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టారు. పాలేరు నియోజకవర్గ టిక్కెట్ తనకే కేటాయించాలని, తన కుమారుడికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వాలని, అలాగే మరికొన్ని డిమాండ్ చేశారు. అందులో పాలేరు  టిక్కెట్ గురించి తుమ్మలకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి:- టీడీపీ అభ్యర్థులుగా జనసేన పార్టీ నేతల పోటీ

తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడ పోటీ చేస్తానన్న టిక్కెట్ ఇస్తామని అధిష్టానం అంగీకరించి హామినిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ డిమాండ్ అంగీకారమేరకే తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు గాంధీభవన్ లో గుసగుసలాడుతున్నారు. అయితే తుమ్మల ఖమ్మంలో అయితే ఈజీగా గెలుస్తారని పార్టీ భావిస్తోంది. ఇదే విషయాన్ని తుమ్మలకు కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్లు సమాచారం. తుమ్మల నాగేశ్వరావు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన లక్ష్యం సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని పాలేరు జలాశయం లో కలిపి జిల్లాను సస్యశ్యామలం చేయడం. ఆ లక్ష్యం నెరవేరాలంటే ఆయన ఖమ్మంలో గెలుస్తే సరిపోతుందా..? పాలేరులో పోటీ చేస్తే బాగుంటుందా..? అనే అంశంపై తుమ్మల నాగేశ్వరరావు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

== 20న లేదా 22న పాలేరు కు తుమ్మల..?

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తుమ్మల నాగేశ్వరరావు మొదటిసారిగా ఖమ్మం జిల్లాకు రాబోతున్నారు. ఈనెల 20 లేదా 22న ఆయన హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ నేతగా  ఖమ్మం జిల్లాకు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ రోజు జిల్లా సరిహద్దు నుంచి భారీ ర్యాలీగా పాలేరు నియోజకవర్గం వరకు కొనసాగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కూసుమంచి మండల కేంద్రంలో సభ, ఖమ్మంలోని గోళ్ళగూడెం తన నివాసం వద్ద  మీటింగ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజున తుమ్మల రాజకీయ భవిష్యత్ పై తుదినిర్ణయం చేసి ప్రకటించనున్నట్లు, విషయాన్ని తెల్చి చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పస్ట్ఈజ్ బెస్ట్ కార్యక్రమంగా ఉండాలనే ఆలోచనతో తుమ్మల వర్గీయులు భారీ జనసమీకరణ చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే పాలేరు టిక్కెట్ తుమ్మలకు దక్కుతుందా..? ఖమ్మం నియోజకవర్గం వైపు వెళ్లే అవకాశం ఉందా..? చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే మరీ..?