Telugu News

సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయటం నాజీవిత లక్ష్యం: తుమ్మల 

0

సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయటం నాజీవిత లక్ష్యం: తుమ్మల 

== త్వరలోనే అది నెరవేరబోతుంది

== సీతారామ కాలువ పనులను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఏన్కూరు మే 15(విజయం న్యూస్):
సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి,రైతులకు సాగునీరు అందించటమే తన జీవిత లక్ష్యం అని,ఆ కల కూడా త్వరలోనే నెరవేరుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఏన్కూరు సీతారామ లింక్ కెనాల్ ను సందర్శించారు. లింకు కెనాల్ పనులను పరిశీలించారు.త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ…భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సమీపంలో టన్నెల్ పూర్తయి,పాలేరు రిజర్వాయర్ లో కలిపితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుందని తెలిపారు.గోదావరి జలాలు వాడుకున్న మొట్టమొదటి ప్రాజెక్టు అవుతుందని అన్నారు. త్వరలోనే సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తయి తన జీవిత ఆశయం,కల నెరవేరుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు.ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చి సహకరించిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మెయిన్ కెనాల్ పనులు నాలుగు పంప్ హౌస్ లతో పాటు దాదాపుగా అన్ని పనులు పూర్తి అయ్యాయని,పంపు హౌస్ ల ద్వారా లింక్ కాల్వలను సాగర్ కెనాల్ లో కలిపి రైతులకు నీరు అందించడం మొదటి ప్రతిపాదన, ఈ ప్రతిపాదన ద్వారా నాగార్జునసాగర్ కాలువలో కలిపే ఏన్కూరు లింకు కెనాల్ పూర్తయితే ఈ ఏడాదే వైరా ప్రాజెక్టు కింద భూములు సాగులోకి వస్తాయని తెలిపారు.గత ఏడాది లాగా కృష్ణకు నీళ్లు రాకపోయినా గోదావరి జలాలతో కృష్ణ ఆయకట్టును పండించుకోవచ్చునని సూచించారు.అదేవిధంగా వైరా ప్రాజెక్టు కింద తాగునీరు కొరత లేకుండా పోతుందన్నారు.సాగర్ జలాలు రాకపోయినా వైరా,మధిర నియోజకవర్గాలతో పాటు,సత్తుపల్లి లంకాసాగర్ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉందని అన్నారు.ముఖ్యమంత్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,నేను అడగగానే సీఎం స్పందించి త్వరగా పూర్తి చేయాలన్నారు.వారి సూచనల మేరకు పనులు మొదలు పెట్టామని, రైతులకు కొంత ఇబ్బంది జరిగిన వారికి నేను,ఎమ్మెల్యే కలిసి న్యాయం చేయటం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, జిల్లా పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు,తుమ్మల ముఖ్య అనుచరుడు గుత్తా వెంటేశ్వరరావు,మండల పార్టీ అధ్యక్షుడు స్వర్ణ నరేంద్ర కుమార్,ఏ బ్లాక్ అధ్యక్షులు వేముల కృష్ణ ప్రసాద్,మండల నాయకులు మేడికొండూరు ప్రసాద్,మేడ ధర్మారావు,కొనకంచి రామకృష్ణ, వాసిరెడ్డి నాగేశ్వరరావు,స్వర్ణ ప్రహ్లాదరావు,చందమామ నరసింహారావు,ముక్తి వెంకటేశ్వర్లు,నల్లమల శివకుమార్,ఆది నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.