Telugu News

తెలంగాణ సర్కార్ లోనే ‘పాలెం’ సమగ్రాభివృద్ధి: మంత్రి

మరో అవకాశం ఇవ్వండి.. సమస్యల్లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతా

0

తెలంగాణ సర్కార్ లోనే ‘పాలెం’ సమగ్రాభివృద్ధి: మంత్రి

== మరో అవకాశం ఇవ్వండి.. సమస్యల్లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతా

== అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణ సర్కార్ లోనే రఘునాథపాలెం మండలం సమగ్రాభివృద్ధిని సాదించిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మరో అవకాశం ఇస్తే సమస్యల్లేని మండలాన్ని తయారు చేస్తానన్నారు. మంగళవారం శివాయిగూడెంలో గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లను మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. గత పాలకుల హయాంలో గ్రామాల అభివృద్దికి రూ.10 లక్షలు కూడా నిధులు వచ్చేవి కాదన్నారు. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామానికి రూ. కోట్ల నిధులు వెచ్చిస్తున్నారన్నారు. శివాయిగూడెం చిన్న గ్రామ పంచాయితీ ఐనప్పటికీ నాలుగేళ్లలోనే రెండు కోట్ల పైచిలుకు పలు అభివృద్ధి పనుల నిమిత్తం కేటాయించినట్లు తెలియజేశారు. అంతేకాక పల్లెలను పట్టణాలకు ధీటుగా సౌకర్యాలను సమకూర్చడమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమన్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో అన్ని సీట్లు  గెలుస్తాం: మంత్రి పువ్వాడ

గతంలో గ్రామాల్లో కరెంటు ఎప్పుడు పోతుందో, పోతో మళ్లీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి అన్నారు. ఈ పరిస్థితి తెలంగాణ సర్కార్లో పునావృతం కాకూదనే ఉద్దేశంతో అవసరమైన చోట సబ్ స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాల్లో కోతల్లేని విద్యుత్ను అందించడంతో పాటు మిరుమిట్లు గొలిపే కాంతిని అందిచాలని గ్రామగ్రామాన హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతేకాక పల్లెల్లో పారిశుద్య సమస్య, డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచడం, రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు.

== రూ. 2.66 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పువ్వాడ.

అత్యంత దుర్భరమైన పరిస్థితుల నుండి నేడు ఖమ్మం నగరం అభివృధ్దిలో ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచిందని ఇంతటి అభివృద్ది సాధించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, నన్ను సాదుకుంటారో.. సంపుకుంటారో మీ చేతుల్లోనే ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో రూ.2.66 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు  చేశారు. ఖమ్మం నగరం 6వ డివిజన్ నందు ఎల్ఆర్ఎస్ నిధులు రూ. 1.76 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు. 56వ డివిజన్ నందు ఎల్ఆర్ఎస్ మున్సిపల్ సాధారణ నిధులు రూ.90 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్, కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఇది కూడా చదవండి: అందరికీ సొంత ఇల్లు ఉండాలనేదే కేసీఆర్ ధ్యేయం: రవిచంద్ర

ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జెడ్సీ సిఈవో వీవీ అప్పారావు, జెడ్పీటీసీ మాళోతు ప్రియాంక, పీఆర్ ఇఇ కేవీకే శ్రీనివాస్, తహసీల్దార్ థామస్ విల్సన్, ఎంపీడీవో రామకృష్ణ, శివాయిగూడెం సర్పంచ్ చెరుకూరి ప్రదీప్, పువ్వాడ నగర్ సర్పంచ్ కాంపాటి లలిత, మాజీ జెడ్పీటీసీ కుర్రా భాస్కర్, వైస్ ఎంపీపీ గుత్తా రవి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, ఆత్మ చైర్మన్ లక్ష్మణ్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు లాల్సింగ్, నందా, కాంపాటి రవి, సాధిక్ పాషా తదితరులు పాల్గొన్నారు.