జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా బోయిన వేణు
== నియామక పత్రాన్ని అందించిన జిల్లా అధ్యక్షుడు
ఖమ్మం/నేలకొండపల్లి, జూన్ 26(విజయంన్యూస్)
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఉపాధ్యక్షునిగా నేలకొండపల్లి మండలం రాయగూడెం గ్రామానికి చెందిన బోయిన వేణు ని నియమిస్తు జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామక పత్రాన్ని ఆదివారం నాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ చేతుల మీదుగా అందుకున్నారు. వేణు మాట్లాడుతూ జిల్లాలో బీసీల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడతానని, బీసీల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఈసారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నా వంతు ప్రయత్నిస్తానని వేణు అన్నారు. తన నియామకానికి కృషిచేసిన సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్కకి, జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ కి, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్,ఖమ్మం జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు గజ్జెలి వెంకన్న, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని, నేలకొండపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు, పగడి కత్తుల సుదర్శన్, బానోతు నరేష్, నేలకొండపల్లి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ దనవతు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.