Telugu News

కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే తాటీ

రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక

0

కాంగ్రెస్ లో చేరిన తాటీ వెంకటేశ్వర్లు

== గాంధీ భవన్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే
== ఆయనతో పాటు కరకగూడెం జడ్పీటీసీ కాంతారావు కూడా
== కుండవ కప్పి స్వాగతం పలికిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
== ఖమ్మం జిల్లా నేతలు ఎవరు లేకుండా కాంగ్రెస్ లో చేరిన తాటి
== సీతక్క ఆధ్వర్యంలో చేరినట్లు ప్రచారం
అశ్వరావుపేట, జూన్ 24(విజయంన్యూస్)

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే సంచలన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అనుకున్నట్లుగానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆ సమయంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడు లేకపోవడం గమనర్హం.

All so read-నల్లా నీళ్ళల్లో మాంసపు ముద్దలు

అయితే ఆయన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. తమ ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, తన వెనకాల చాలా మంది మిత్రులు చేర బోతున్నారని వ్యాఖ్యానించారు.ఎనిమిది సంవత్సరాల పాలనలొ టి.అర్.ఎస్ ప్రభుత్వం పలు మార్లు మాట తప్పిందన్నారు.ముఖ్యంగా పోడు భూముల విషయం లొ మాట నిలబెట్టుకొనే పరిస్థితి నేటి ప్రభుత్వానికి లేదని పునరుద్గాటించారు.

ఆనాడు వై.యస్ రాజశేఖర్ రెడ్డి పోడు భూములకు పట్టాలిచ్చారని,అదేవిధంగా నేడు రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి పోడు పరిష్కానికి హమి నిచ్చారని ,ఆ హమితోనే తను కాంగ్రెస్ లోకి చేరుతున్నట్లు తెలిపారు.
ఇదిలాఉండగా ఇటీవల సీతక్క,నియోజకవర్గం లొ పర్యటించి,ఆదివాసి సమస్యలు పై గళం ఎత్తారు.ఆదివాసిల తరుపున తాము ముందుండి పోరాటం చేస్తామని హమి నివ్వడం,ఆదివాసి నాయకులు కలవడం ,నేడు ఆమె అధ్వర్యం లొ కాంగ్రెస్ లొ చేరడం ప్రధాన్యతను సంతరించుకొంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి
కాంగ్రెస్ లో చేరిన వారిలో
అశ్వారావుపేట టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుంకవల్లి వీరభద్ర రావు, అశ్వారావుపేట మాజీ జడ్పిటిసి అంకత మహేశ్వరరావు, వినాయకపురం మాజీ సర్పంచ్ పొట్ట రాజులు, కుడుములపాడు మాజీ సర్పంచ్ కారం ఎర్రయ్య, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, దమ్మపేట మండలాలు నుండి సుమారు 200 మంది అనుచరులు చేరారు..