Telugu News

రాజ్‌భవన్‌ ముందు మేయర్‌, కార్పోరేటర్ల ఆందోళన

బండి సంజయ్‌, గవర్న్‌కు వ్యతిరేకంగా నినాదాలు

0

రాజ్‌భవన్‌ ముందు మేయర్‌ తదితరుల ఆందోళన

== బండి సంజయ్‌, గవర్న్‌కు వ్యతిరేకంగా నినాదాలు

== రాజ్‌భవన్‌ గేటుకు వినతిపత్రం అతికింపు

 == అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందచేత

హైదరాబాద్‌,మార్చి11(విజయంన్యూస్):  బిఆర్‌ఎస్‌ ఆందోళనతో రాజ్‌ భవన్‌  ముందు ఉద్రిక్త నెలకొంది. ఆందోళనకు దిగిన జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  బండి సంజయ్‌ పై ఫిర్యాదు చేసేందుకు జీహెచ్‌ఎంసీ మేయర్‌, ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే గొంగిడి సునీత  ఆధ్వర్యంలో మహిళా కార్పొరేటర్లు, పలువురు మహిళా నేతలు రాజ్‌ భవన్‌కు వచ్చారు. అయితే గవర్నర్‌ తమిళి సై అపాయింట్‌ మెంట్‌ ఖరారు కాలేదని రాజ్‌ భవన్‌ వర్గాలు తెలిపాయి. దీంతో మేయర్‌, మహిళా కార్పొరేటర్లు రాజ్‌ భవన్‌ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు.

ఇది కూడా చదవండి: 16న ఈడీ ముందుకు కవిత

వినతి పత్రాలను రాజ్‌ భవన్‌ గోడకు అంటించారు. బీజేపీకి, గవర్నర్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం నుంచి గవర్నర్‌ అపాయింట్‌ మెంట్‌ అడిగినా ఇవ్వడం లేదని కార్పొరేటర్లు ఆరోపించారు.  గవర్నర్‌ అపాయింట్‌ మెంట్‌ ఇచ్చే వరకు ఆందోళన చేస్తామన్నారు. బండి సంజయ్‌ క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే గొంగిడి సునీత డిమాండ్‌ చేశారు. భారీగా మోహరించిన పోలీసులు మేయర్‌ తో పాటు మహిళా నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.. బండి సంజjైు్ప జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి నిప్పులు చెరిగారు. కవితను కించపరిచేలా మాట్లాడిన బండి సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో అందుకు నిరసనగా ట్యాంక్‌ బండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, ఎమ్మెల్యే గొంగిడి సునీత కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి విూడియాతో మాట్లాడారు. గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరితే ఇవ్వలేదు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌ తమిళిసై బండి సంజయ్‌ వ్యాఖ్యలపై స్పందించాలని మేయర్‌ డిమాండ్‌ చేశారు. బండి సంజయ్‌ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టం అని తేల్చిచెప్పారు. కవితకే కాదు.. మొత్తం మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని మేయర్‌ డిమాండ్‌ చేశారు.

ఇదికూడా చదవండి: బండిసంజయ్ పై బీఆర్ఎస్ ఫైర్