Telugu News

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం: పువ్వాళ్ల దుర్గప్రసాద్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాపరిపాలనలో విఫలం

0

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం

== కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాపరిపాలనలో విఫలం
== ధరలను నియంత్రించే నాథుడే కరువైయ్యారు
== కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకే సారి రైతు రుణమాఫీ
== రూ.500కే గ్యాస్, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం
== రాహుల్ గాంధీ  ఇచ్చిన హామీలన ప్రజల్లోకి తీసుకెళ్లాలి
==  విలేకర్ల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్
తల్లాడ, నవంబర్ 10: 
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని, ప్రజల కోసం, ముందు చూపుతో పరిపాలన అందించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అన్నారు. గురువారం తల్లాడ మండలంలోని పార్టీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ  నిత్యావసర
ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైయ్యాయని, క్రైమ్  నియంత్రణ లేకపోవడం వల్ల పట్టపగలే హత్యలు, ఆత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పేదలకు అందాల్సిన గ్యాస్ ధరను అమాంతంగా పెంచేశారని, రైతులకు రుణమాఫీ చేయలేకపోవడమే కాకుండా రైతులకు అందాల్సిన సబ్సీడిలను మొత్తం ఎత్తేశారని, ఎరువులు, విత్తనాలపై, పురుగుల మందులపై ధరలను విఫరీతంగా పెంచేశారని  ఆరోపించారు.
కేంద్ర,రాష్ట్రంలో ప్రజా పరిపాలనను గాలికి వదిలేసి పెట్టుబడిదారులను పెంచి పోచిస్తున్నారని ఆరోపించారు.  రాష్ట్రంలో పెద్ద దోపిడి ధరణి పోర్టల్ అని , తద్వారా బడారైతులకు, భూస్వాములకు మేలు జరిగిందని, నిరుపేద రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు.  కేంద్ర, రాష్ట్రాల్లో పేదవారికి వైద్యం, విద్య అందే పరిస్థితి లేదని, పైసలతో కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్త్థితి వచ్చిందన్నారు. అందుకే  రాబోయే రోజుల్లో  కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు ఆశీర్వదిస్తే నిత్యావసర ధరలను నియంత్రణలోకి తీసుకోస్తామని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి, ఒకే సారి రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రకటించారని తెలిపారు. రైతులకు అందాల్సిన సబ్సీడీలన్నింటిని మల్లి పున:ప్రారంభిస్తామని,  రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎరువులు, విత్తనాల ధరలను తగ్గించి రైతులకు అందుబాటు ధరలకు విక్రయాలు చేస్తామని అన్నారు.  కేంద్రంలో, రాష్ట్రంలో క్రైమ్ ను నియంత్రించి, హత్యలు, ఆత్యాచారాలు లేకుండా చర్యలు తీసుకుంటామని రాహుల్  గాంధీ హామినివ్వడం జరిగిందన్నారు.
 ప్రతి పేదవాడికి విద్య, వైద్యం కార్పోరేట్ అందిస్తామని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు. కచ్చితంగా గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించి  గ్యాస్ రూ.500కే అందిస్తామని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు. అలాంటి అద్బుతమైన పథకాలను ప్రజలకు అందించేందుకు సిద్దమైన రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని, రాబోయే ర ోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ప్రభుత్వాలకు పుల్ స్టాఫ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలందరు ఆశీర్వదించాలని కోరారు.
అలాగే కాంగ్రెస్ పాార్టీ నాయకులు, కార్యకర్తలు రాహుల్ గాంధీ ప్రజలకు ఇచ్చిన హామీలను జనంలోకి తీసుకెళ్లాలని, గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేయాలని కోరారు. వీలుంటే కరపత్రాలను వేయించాలని, వాటిని ప్రజలకు పంపిణి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్ర అంజయ్య, తల్లాడ, వైరా మండల అధ్యక్షులు కాపా సుధాకర్, నర్సిరెడ్డి, నాయకులు హరినాథ్ తదితరులు హాజరైయ్యారు.