Telugu News

కందాళని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ కార్యకర్తలకు ఉంది

= కాంగ్రెస్ ఓట్లతో గెలిచారు కాబట్టి రాజీనామా చేయండి

0

కందాళని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ కార్యకర్తలకు ఉంది
== కాంగ్రెస్ ఓట్లతో గెలిచారు కాబట్టి రాజీనామా చేయండి
== భట్టిని అడ్డుకునే శక్తి, విమ్మర్శించే దైర్యం టీఆర్ఎస్ నేతలకు లేదు
== విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు కళ్లెం వెంకట్ రెడ్డి
(ఖమ్మం –విజయం న్యూస్)
పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా మోయని కందాల ఉపేందర్ర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపించారని, కార్యకర్తలు, నాయకులకు తెలియకుండా, ఎవరికి చెప్పకుండా దొంగతనంగా టీఆర్ఎస్ పార్టీలో చేరారని, ఎందుకు పార్టీ మారారో..? అడిగే, ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు ఉందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటి చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు, ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు కళ్లెం వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలోని టీఎన్జీవోస్ కాలనీలో అధ్యక్షులు కళ్ళెం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తీరని ద్రోహం చేశారని, ఆయన చేసిన ద్రోహానికి నిత్యం విమర్శిస్తూనే ఉంటాం అన్నారు .

కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను గ్రామాల్లో తిరగనివ్వమని మాట్లాడుతున్నారూ మీరేమైనా వీది రౌడిలా అని ప్రశ్నించారు. మీకు రోషం, పౌరుషం ఉంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన కందాళను తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి, కారుకూతలు మానుకుని కారు గుర్తు మీద గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. మేము మీ నాయకుడిని విమర్శించం అంతేగానీ మీ స్వార్ధ రాజకీయాల కోసం మీరు చేస్తున్న చిల్లర రాజకీయాలను పాలేరు ప్రజలు చీ కొడుతున్నారని ఘాటుగా స్పందించారు. గతంలో మీరు చేసిన చిల్లర చేష్టలతోనే పాలేరు లో ఓడిపోయారని, మరోసారి పాలేరు గడ్డ మీద కాంగ్రెస్ మువ్వన్నెల జెండా ఎగరేయడానికి పాలేరు ప్రజలు కాంగ్రెస్ తో కలిసి సిద్ధంగా ఉన్నారన్నారు.

allso read :- సీఎం కేసీఆర్ వరిపంటేట్ల వేస్తడు..కేసీఆర్ వ్యవసాయభూమిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

శాసనసభా పక్ష నాయకులు భట్టి విక్రమార్కని విమర్శించే నైతిక విలువలు మీకు లేవన్నారు. భట్టి పిల్లిలా పారిపోలేదని, పులి వస్తుంటే భయపడి ఆయన ముందుకు పోయిన తరువాత వెనకవాహానాలు ఆపి షో చేయాలని చూశారని ఆరోపించారు. భట్టీని అడ్డుకునే వారైతే కూసుమంచి మండల కేంద్రంలోనే సమావేశం జరిగింది కదా..? అక్కడకు వచ్చి అడ్డుకోవచ్చు కదా..? అని ప్రశ్నించారు. కందాళ ఉపేందర్ రెడ్డి మొప్పు కోసం రోడ్డు మీద షో చేసేందుకు వచ్చారని, అంతే తప్ప నిజంగా కాంగ్రెస్ ను, భట్టి విక్రమార్కను అడ్డుకునే దైర్యముందా..? అని ప్రశ్నించారు. భట్టి సమావేశం ముగించుకుని ర్యాలీగా కూసుమంచి సెంటర్ కి చేరుకునే సమయానికి టీఆర్ ఎస్ నేతలు పారిపోయారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కన్నేటి వెంకటేశ్వర్లు , తనగంపాడు సర్పంచ్ కేతినేని వేణు, మంకెన వాసు, మద్ది వీరారెడ్డి, బానోత్ పాప్యా నాయక్ ,పోటు లెనిన్, ఆరెంపుల రామయ్య కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
== రాజీనామా చేసి గెలవాలి.. లేకపోతే గ్రామాల్లో తిరగనివ్వం : బొడ్డుబొందయ్య
నేలకొండపల్లి : పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై పోటీ చేశారని, తను రాజీనామా చేసి కారు గుర్తుపై గెలిచే అంత వరకు విమ్మర్శిస్తునే ఉంటామని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య డిమాండ్ చేశారు. హస్తం గుర్తు చూసే ప్రజలు ఆయనకు ఓట్లేశారని, వ్యక్తిగతంగా ఆయన గెలిశారనే తెరాస నాయకుల ప్రచారాన్ని ఆయన కొట్టి పడేశారు. మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కను వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకోబోమని, గ్రామాల్లో కందాళను తిరగవివ్వమని మండల కాంగ్రెస్ నాయకులు స్పష్టం. చేశారు.

భట్టి కుటుంబసభ్యులు వివిధ కారణాలతో మరణిస్తే దాన్ని రాజకీయాలకు ఆపాదించడం సరికాదని ఆయన అన్నారు. పాలేరు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటని, ఇక్కడ మళ్లీ ఎన్నికలు వచ్చినా భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని బొందయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలు, నాయకులెవరూ ఆయనతో పాటు పార్టీ మారలేదనే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టిలో ఉంచుకోవాలని నాయకులు అన్నారు. అభివృద్ధి చేయకుండానే మధిరలో ఎమ్మెల్యేగా భట్టి మూడు సార్లు గెలిచారా..?

అని తెరాస నాయకులను ప్రశ్నించారు. ఒక్కసారి పాలేరులో కందాళ రాజీనామా చేసి గెలవాలని తెరాస నాయకులకు సవాలు విసిరారు. తుమ్మలను ఓడించేందుకు పనిచేసిన తెరాస నాయకులే ప్రస్తుతం కందాళ వెంట ఉన్నారని, కాంగ్రెస్ నాయకులు అధికారి కూడా వరుసగా రెండేళ్లు నేలకొండపల్లి మండలంలో పనిచేయని దుస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. కూసుమంచి తెరాస అధ్యక్షుడిగా ఉన్న దళితున్ని ఎందుకు మార్చారో అందరికీ తెలుసన్నారు. దళితుల పట్ల పక్షపాతం వహిస్తున్న ఈ ఎమ్మెల్యేకు పాలేరు ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ సేవా దళ్ అధ్యక్షుడు బచ్చలకూరి నాగరాజు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు జెర్రిపోతుల అంజని,బోయిన వేణు, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ బాజామియా, నాయకులు రేగూరి హనుమంతరావు, సత్యనారాయణ, నేలకొండపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు, పగిడికత్తుల సుదర్శన్, రాచకోండ అయ్యప్ప, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :-కూసుమంచి పెట్రోల్ బంక్ లో వినియోగదారుల ఆందోళన..*