Telugu News

కాంగ్రెస్,కామ్రెడ్ల పొత్తు సంగతేంటి..?

పొత్తులు సఫలమా..? విఫలమా..?

0

కాంగ్రెస్,కామ్రెడ్ల స్నేహం చిగురించేనా..?

== పొత్తులు సఫలమా..? విఫలమా..?

== ఆయోమయంలో నేతలు..కార్యకర్తలు

== భయాందోళనలో కాంగ్రెస్ ఆశావాహులు

== పసిగట్టలేకపోతున్న పొలిటికల్ ఎనాలసిస్టులు

కాంగ్రెస్, కామ్రెడ్ల పరిస్థితి ఎవరికి అర్థం కావడం లేదు.. పొత్తులంటున్నారు.. ఎవరి పని వారే చేసుకుంటున్నారు.. ఎన్నికల సమయం ముంచుకోస్తున్న చీమ కుట్టినట్లు వ్యవహరించడం లేదు.. పొత్తులకు సంబంధించిన ప్రక్రీయ ప్రారంభం కాకుండానే పొత్తులే అంటూ ఎవరికివారు వేమునాతీరుగానే వ్యవహరిస్తున్నారు.. ఒక వైపు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించేందుకు కసర్తతు చేస్తోంది..

ఇది కూడా చదవండి:- మంత్రి వేదిస్తున్నారన్న మహిళా కార్పోరేటర్

ఫలితంగా కామ్రెడ్లు ఆయోమయంలో పడిపోయారు… కార్యకర్తలు కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు.. పొలిటికల్ ఎనాలసిస్టులు కూడా పసిగట్టలేకపోతున్నారు.. పొత్తుల సంగతేమో..కానీ.. ఆశావాహులు మాత్రం టెన్షన్ తో కలవరపడుతున్నారు.. కాంగ్రెస్ అభ్యర్థుల్లో కలవరం మొదలైంది.. టిక్కెట్ మాకా..కామ్రెడ్ల కా..? అంటూ ఆందోళన చెందుతున్నారు.. కానీ దోస్తికి సంబంధించిన ప్రక్రీయ ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు.. అనే విషయాలపై ‘విజయం’ ప్రతినిధి అందించే రాజకీయ విశ్లేషణ్మాత్మక కథనం..

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు దూరంగా ఉన్న కమ్యూనిస్టులు, రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీతో వెళ్దామనుకున్నారు.. కానీ సీఎం కేసీఆర్ మోసంతో కమ్యూనిస్టులు కలవరపడ్డారు.. ఏం జరిగిందో తెలుసుకునే లోపే అన్ని జరిగిపోయినయ్.. అలిగిపోయిన అల్లుడు తిరిగి వచ్చినట్లు  కాంగ్రెస్  గూటి వైపు చూస్తున్నారు..

ఇది కూడా చదవండి:- రాయల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు..ఏంటంటే..? 

రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చెబుతున్నప్పటికి టిక్కెట్ల లొల్లి ఆ పార్టీలను కలవనీవ్వడం లేదు.. ఎన్నికల సమీపిస్తున్నప్పటికి కమ్యూనిస్టులు నిశబ్ధం పాటిస్తున్న తరుణంలో కాంగ్రెస్ కూడా తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతుంది.. కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో నిమగ్నమైంది.. కొద్ది రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. అయితే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను కలుపుకుని పోతుందా..? మధ్యలోనే వదిలేస్తుందా..? పూర్తి వివరాల్లోకి వెళ్తే

 తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలో పరిస్థితి అక్కరుకు రాని పిన్నమ్మ అన్నట్లుగా మారింది.. నాడు పూర్తి బలంగా ఉన్న కమ్యూనిస్టులు ఏళ్లు గడుస్తున్నా కొద్ది ఆ పార్టీలకు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది.. రాజకీయ ఎత్తుల్లో వెనకబడిపోతున్న కమ్యూనిస్టు పార్టీలు, ఆయా పార్టీలతో పొత్తులకు చేయిచాపడంతోనే తమ ప్రాభల్యాన్ని కొల్పోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి:- పాలేరులో బీఆర్ఎస్ కు బిగ్ షాక్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీ, పార్లమెంట్ లో తమ ప్రాభల్యం చాటుకునే కమ్యూనిస్టు పార్టీలు ప్రస్తుతం ఒక్క సీటును కూడా గెలిచే పరిస్థితి లేకుండా పోయింది.. 2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆ తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని దక్కించుకోలేకపోయాయి. అంతే కాకుండా రాజకీయ తప్పటడుగులు వేస్తుండటంతో ఆ పార్టీలకు విశ్వసనీయత లేకుండా పోతుంది. ప్రజలు కూడా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అందుకే తెలంగాణ కమ్యూనిస్టు పార్టీలు ప్రాభల్యం కోల్పోయాయి. కమ్యూనిస్టు పార్టీలు వీడిపోవడం, వర్గాలుగా మారిపోవడం, ఏ పార్టీ దారి ఆ పార్టీదే అన్నట్లుగా ఉంది. 2014 ఎన్నికలను పరిశీలస్తే వైసీపీ పార్టీతో సీపీఎం పార్టీ పొత్తు పెట్టుకోగా, కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పార్టీ పొత్తు పెట్టుకుంది.. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాయి..  2018 గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేయగా, సీపీఐ పార్టీ ఒంటరిగా పోటీ చేశాయి.. ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికితే, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు మద్దతు తెలిపాయి. ఏ జిల్లాకు ఆ జిల్లా పొత్తులు పెట్టుకోవడంతో కూడా ఆ పార్టీలు దెబ్బతిన్నాయనే చెప్పాలి. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో అవసరం లేకున్న అధికార బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీలపై ప్రజలకు విశ్వాసం పోయింది.. అంతేకాదు.. స్వంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది..

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ గెలుపే నా ధ్యేయం…: రాయల

అయినప్పటికి పర్వాలేదు అధికార పార్టీతో పొత్తు మంచిదే సీట్లు పెరుగుతాయి, అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంటుందని కమ్యూనిస్టులు భావించారు. కానీ సీఎం కేసీఆర్ రాజకీయ ఎత్తుగడకు కమ్యూనిస్టు పార్టీలు నోరేళ్లపెట్టాల్సి వచ్చింది. కేసీఆర్ కు తోక పార్టీలుగా మారిపోయాయి.. ఈ సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాలపై ఆ పార్టీ కార్యవర్గాలు మండిపడినట్లు తెలుస్తోంది.. నిర్ణయాల్లో లోపం కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

==  కాంగ్రెస్ తో పొత్తు ఏమైనట్లు..?

సీపీఎం, సీపీఐ పార్టీలను సీఎం కేసీఆర్ పట్టించుకోకుండా టిక్కెట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆ రెండు పార్టీలో డైలమాలో పడిపోయాయి. చివరికి కాంగ్రెస్ తో దోస్తికి సై అన్నాయి.. కానీ సీపీఎం, సీపీఐ పార్టీల అధిష్టానాలు ఇప్పటి వరకు కలిసి సమావేశం నిర్వహించలేదు.. రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ నాయకులతో సమావేశాలు నిర్వహించలేదు.. కానీ ప్రకటనలు మాత్రం చేస్తున్నాయి.. కాంగ్రెస్ మాకు నచ్చిన సీట్లు ఇస్తే పొత్తులు ఆలోచిస్తామని సీపీఎం ప్రకటిస్తుంటే, సీపీఐ పార్టీ నాయకత్వం మాత్రం నేరుగా కాంగ్రెస్ నేతలను కలిసి వారి డిమాండ్ పత్రాన్ని అందించారు.

ఇది కూడా చదవండి:- పాలేరు కు పొంగులేటి

కొత్తగూడెం సీటును తమకే ఇవ్వాలని సీపీఐ బలంగా కోరడం, గతంలో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ కు కారణమైంది. మునుగోడు ఉపఎన్నిక తర్వాత కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించడం కొత్తగూడెం నేతలకు మింగుడు పడలేదు. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించిన నేతలు రాబోయే ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటు విషయమై ఒత్తిడికి లోనయ్యారు. అయితే సీఎం కేసీఆర్ ఏకపక్షంగా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి పొత్తులకు ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. అప్పటి నుంచి కాంగ్రెస్, సీపీఐల మధ్య పొత్తుపై ఊహాగానాలు మొదలయ్యాయి. కొత్తగూడెం, మునుగోడు, బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్ స్థానాలను ఇవ్వాలని సీపీఐ పార్టీ కాంగ్రెస్ ముందు డిమాండ్ ఉంచింది.. ముఖ్యంగా కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఏడాది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాపోరాటాలు చేస్తూ కేడర్ని క్రియాశీలకంగా ఉంచుతున్నారు. కొత్తగూడెం సీటు వ్యవహారం తేలాకే మిగిలినవి చర్చలోకి వస్తాయని ఇప్పటికే కూనంనేని పలుమార్లు తేల్చి చెప్పారు. దీంతో పొత్తుల సందర్భంగా కొత్తగూడెం సీటు విషయంలో పీటముడి పడే అవకాశం ఉంది. ఇక పాలేరు నియోజకవర్గం విషయంలో అదే పీటముడి ఉంది..

ఇది కూడా చదవండి:- తుమ్మల “ఖమ్మం” లో పోటీ..?

కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న పాలేరు సీటును సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు అడుగుతున్నారు. ఆ సీటు ఇస్తేనే పొత్తులు ఉంటాయని ప్రకటిస్తున్నారు. పాలేరు, భద్రాచలం, వైరా, మిర్యాలగూడెంతో పాటు మరో రెండు స్థానాలను అడిగినట్లు తెలుస్తోంది.. భద్రాచలం ఇప్పటికే సిట్టింగ్ సీటు, పాలేరు ఇచ్చే అవకాశం లేదు. అందుకే సీపీఎం పొత్తుల గురించి ఆలోచించడం లేదని తెలుస్తోంది..

== టిక్కెట్లను ప్రకటించే పనిలో కాంగ్రెస్

ఒక వైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణం.. మరో వైపు టిక్కెట్లను ప్రకటిస్తున్న సందర్భం.. ఈ దశలో పొత్తుల ఎత్తులు అత్యంత కీలకం.. రాబోయే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకునే పార్టీలు ఇప్పటికే టిక్కట్ల చర్చలు పూర్తి కావాల్సి ఉంది.. కానీ ఇప్పటి వరకు సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ ల మధ్య పొత్తుల చర్చలు జరగలేదు. సీపీఐ పార్టీ మాత్రమే కాంగ్రెస్ నేతలను కలిసి తమ డిమాండ్లను చెప్పగా, సీపీఎం మాత్రం జాతీయ కమిటీకి అప్పగించింది.. జాతీయ స్థాయి కమిటీలో కూడా ఎక్కడ పొత్తులపై చర్చలు జరిపినట్లు కనిపించడం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ పనితాము చేసుకుంటూ వెళ్తున్నారు.

ఇది కూడా చదవండి:- ఖద్దర్ పాలన..ఖరీదైన రాజకీయాలు.. ఖతమైన బంధాలు

ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు అశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అదిష్టానం, ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ ద్వారా అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి అదిష్టానానికి పంపించారు. అతి త్వరలోనే పైనల్ లిస్ట్ బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే సీపీఐ, సీపీఎం పార్టీల పొత్తులతో ముందుకు వెళ్తారా..? లేదంటే అభ్యర్థులను ప్రకటించేస్తారా..? అనే విషయంపై స్పష్టత లేదు.అయితే కొత్తగూడెం సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉన్నట్లు సమాచారం. కొత్తగూడెం, మునుగోడు స్థానాలను సీపీఐకి కేటాయించి , సీపీఎంకు మిర్యాలగూడెం తో పాటు మరో సీటును కేటాయించే అవకాశాలున్నాయి. ప్రభుత్వం వచ్చిన తరువాత ఇరు పార్టీలకు ఎమ్మెల్సీ, లేదంటే రాజ్యసభ సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉన్నట్లు తెలిపింది.  ఈ విషయంపై సీపీఐ మౌకికంగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. సీపీఎం పార్టీ మాత్రం పాలేరు టిక్కెట్ ఇస్తేనే పోత్తులు ఉంటాయని చెబుతున్నారు. చూడాలి మరీ కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు ఏ స్థాయిలో ఉంటుందో..? ఎవరేవరికి టిక్కెట్లు వస్తాయో..? ఎవరు బెట్టు తిగుతారో..? ఎవరు బెట్టుగా ఉంటారో..? వేచి చూడాల్సిందే..