Telugu News

కేసీఆర్ సభకు భారీగా తరలిరాండీ..: మంత్రి పువ్వాడ

జిల్లాలో జరిగిన మూడు సభలు సక్సెస్ అయ్యాయి

0

కేసీఆర్ సభకు భారీగా తరలిరాండీ..: మంత్రి పువ్వాడ

== జిల్లాలో జరిగిన మూడు సభలు సక్సెస్ అయ్యాయి

== ఈనెల 5న ఖమ్మం, కొత్తగూడెం లో ఆశీర్వాద సభలు

== సభలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం

== విలేకర్ల సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

(ఖమ్మం ప్రతినిధి- విజయం న్యూస్)

సీఎం కేసీఆర్ సభకు  జనం భారీగా తరలిరావాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశం.

*▪️మంత్రి పువ్వాడ అజయ్ కామెంట్స్..*

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో బీఆర్ఎస్ లోకి వలసలు జోరు..

కేసిఆర్ గారు తొలి విడత ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా ఖమ్మం జిల్లాలో మొదటి సభ పాలేరులో జరిగింది.

ఇప్పటివరకు ఏర్పాటు చేసిన 3 సభలు విజయవంతం అయ్యాయి.

ప్రజా ఆశీర్వాద సభలతో ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నాడి తెలుస్తుంది.

కేసిఆర్ సభా ప్రాంగణం నుండి అడిగిన ప్రతి ప్రశ్నకు అనూహ్య స్పందన లభించింది.

కేసిఆర్  మీద ప్రేమ ప్రజల్లో ఆవగింజ అంతైనా తగ్గలేదు.

ఆయన సభకు ప్రజలు స్టేడియంలో ఎంత మంది ఉన్నారో, సభా ప్రాంగణం బయట కూడా అంతే మంది ఉన్నారు.

ఆదివారం 5వ తేదీన SR & BGNR కళాశాల మైదానంలో సభ జరుగుతుంది.

ఆ రోజు రెండు సభలు ఉన్నాయి.. ఒకటి ఖమ్మం, రెండవ ది కొత్తగూడెం.

ఇది కూడా చదవండి:- మంత్రి పువ్వాడ వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు..

ఈ సభను విజయవంతం చేయండి, నా విజయంతో పాటు, ఖమ్మం జిల్లాలో ఉన్న 10 మంది అద్యర్ధుల విజయాలను కాంక్షిస్తూ సభా ఏర్పాటు జరుగుతుంది.

ఆ ప్రాంగణంలో వేలాది మంది ప్రజలు పట్టే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి కెసిఆర్ సభ విజయవంతానికి పోలిస్ వారు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా.

ప్రజా ఆశీర్వాద సభకు కొద్ది సమయమే ఉంటుంది, ప్రజలు త్వరగా సభా ప్రాంగణానికి చేరుకోవాలి.

చలికాలం కావడంతో సన్ సెట్ త్వరగా అవుతుంది, హెలికాప్టర్ వెళ్లేందుకు వాతావరణం అనుకూలించదు.. కాబట్టి ప్రజలు సభా ప్రాంగణానికి త్వరగా చేరుకోవాలి.

ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయి.

ఇది కూడా చదవండి:- ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి ఆయనే : ప్రకటించిన సీఎం

ఈ 75 సంవత్సరాలలో ఖమ్మం నియోజకవర్గానికి మంత్రి పదవి ఇచ్చినా ఘనత సీఎం కెసిఆర్ గారికే దక్కుతుంది.

ఖమ్మంకు మెడికల్ కళాశాల పెట్టాలని 75 సంవత్సరాలలో ఏ పార్టీకి ఆలోచన రాకపోవడం దురదృష్టకరం.

నేను భూమి పుత్రుడిని కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేయాలనీ అనిపిస్తుంది.

ప్రత్యర్థి అభ్యర్థి అంటున్నాడు.. ఆయన హయాంలో ఖమ్మంలో వాటర్ ట్యాంకర్ లు తిరిగేవని. అవును ఆ సమయంలో నా అక్క, చెల్లెళ్ళు నీటి కోసం ఎంత అవస్థ పడ్డారో మీ మాటల్లోనే తెలుస్తుంది.

ఖమ్మం జిల్లాలో ఏర్పడిన ఏకైక మండలం రఘునాథపాలెం మాత్రమే.

రూ.253 కోట్ల రూపాయలు కేవలం రఘునాథపాలేం మండలానికి కేటాయించాం.

ఖమ్మంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలూ అన్ని కేవలం ఈ 5ఏళ్లలో మాత్రమే జరిగాయి.

5వ తేదీన ప్రజలంతా త్వరగా సభా ప్రాంగణానికి చేరుకోవాలి.

త్వరగా వచ్చి సీఎం కెసీఆర్ సందేశాన్ని వీక్షించవచ్చు.

నోటిఫికేషన్ రాకుండానే పొట్టల్లో కత్తులు దింపుతున్నారు.

పేగులు తెగేలా కత్తులు దింపుతున్నారు మీ కార్యకర్తలు

మరొకసారి నాకు అవకాశం ఇస్తే రెండు, మూడు ఇంతలు అభివృద్ధి చేసి చూపిస్తా.

** ▪️సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కామెంట్స్..*

నిన్న సత్తుపల్లి సభను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు.

దేవుడి దయ వల్ల సభకు సంబందించి ఏ ఒక్క ఘటన జరగకపోవడం అదృష్టం.

నిన్న సభతో సత్తుపల్లి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.

ఆ ఉత్సాహంతో ఎన్నికల్లో గెలుపొంది తీరుతాం.

హైదరాబాద్ తర్వాత అంతలా అభివృద్ధి జరిగిన ప్రాంతం ఖమ్మం నగరం మాత్రమే.

ఖమ్మం నగర అభివృద్ధిలో మంత్రి పువ్వాడ అజయ్ కృషి ఎనలేనిది.

కొంతమంది నాయకులు బీ ఆర్ ఎస్ పార్టీలో ఉంటే అప్పుడు 10 కి 10 స్థానాలు ఎందుకు గెలవలేదు.

వీళ్ళు ఎవ్వరూ కాంగ్రెస్ పార్టీలో లేని సమయంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు 9 స్థానాలు వచ్చాయి.

రాజకీయాలకు ఖమ్మం నిలయం.

సీఎం కెసిఆర్ గారు ఖమ్మం జిల్లాకు ఏ అన్యాయం చేయలేదు. కేవలం ఒక్క సీట్ ఇచ్చినా అభివృద్ధిలో మాత్రం ఖమ్మం ను అభివృద్ధిపథంలో ముందుంచారు.

ఇది కూడా చదవండి:- అమ్ముడు పోయే సరుకు నాకు అవసరం లేదు: మంత్రి

సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయ్యింది.

సీఎం కెసిఆర్ గారి సహకారంతో సత్తుపల్లిలో ఒక్క మట్టి రోడ్ లేదు అంటే అతిశయోక్తి కాదు.

గ్రామాల్లో 80 శాతం సిమెంట్ రోడ్లు నిర్మించాం.

సభా ప్రాంగణాలు ప్రజల్లో ఇంత ఉత్సాహంతో జరుగుతున్నాయి అంటే అర్ధం బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందినట్లే.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 సీట్లు బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారు.

** ▪️MLC తాతా మధు కామెంట్స్..*

5వ తేదీన ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్, కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ లో జరిగే ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది.

సీఎం కెసిఆర్ గారు ఇప్పటి వరకు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు అన్ని విజయవంతం అయ్యాయి.

ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్ గారి విజయాన్ని కాంక్షిస్తూ సభ ఏర్పాటు జరగనుంది.

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కమిటీ తరపున ఇతర ప్రాంతాల నుండి ప్రజలు కదిలి రావాలి.

సీఎం కెసిఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పువ్వాడ అజయ్ గారి నాయకత్వంలో నిర్వహించారు.

ఎన్నో వేల కోట్ల నిధులను ఖమ్మం నియోజకవర్గానికి కేటాయించారు.

ఇది కూడా చదవండి:- గ్రామాల్లో బిఆర్ఎస్ విస్తృత ప్రచారం

10 సంవత్సరాలుగా ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు అందిన వారు సభకు వచ్చి విజయవంతం చేయాలి.

** ▪️ఎంపీ వద్ధిరాజు రవిచంద్ర కామెంట్స్..*

నిన్న జరిగిన సత్తుపల్లి, ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతం అయ్యాయి.

5వ తేదీన SR & BGNR గ్రౌండ్ లో ప్రజా ఆశీర్వాద  సభ జరగనుంది.

ఖమ్మం నియోజకవర్గం నుండి సుమారు లక్ష మంది వచ్చి సభను విజయవంతం చేయాలి.

ఇల్లందులో గతంలో చిన్న చిన్న సభలు జరిగి ఉంటాయి కానీ అతి పెద్ద సభ జరిగి, విజయవంతం అవ్వడం ఇదే ప్రథమం.

నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి పువ్వాడ అజయ్ అత్యధిక మెజారిటీ గెలిపించాలి.