*తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ భరోసా : మాజీ మంత్రి తుమ్మల*
అరాచక బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం : ప్రొఫెసర్ కోదండరాం
*తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ భరోసా : మాజీ మంత్రి తుమ్మల*
*అరాచక బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం : ప్రొఫెసర్ కోదండరాం*
(ఖమ్మం-విజయం న్యూస్)
ఖమ్మం నగరం మమత హాస్పిటల్ రోడ్డు ఇ.ఆర్.ఆర్ రిసార్ట్స్ లో ఉద్యమకారుల ఫారం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు , ప్రొఫెసర్ కోదండరాం లు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల జీవితాలు మెరుగుపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అప్పుడే వారి సమస్యలు పరిష్కరించబడతాయని అన్నారు.
ఇది కూడా చదవండి:- ఖమ్మం గాంధీచౌక్ లో తుమ్మలకు ఉప్పొంగిన అభిమానం
ఈ టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో ఉద్యమకారులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని వారి జీవితాలకు ఒక అర్థం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు . ఉద్యమకాలకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం , 250 గజాల ఇల్లు స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కొరకు పది లక్షల రూపాయల నగదు , రాజకీయాల్లో నామినేటెడ్ పదవులలో 25 శాతం రాయితీ ప్రాధాన్యత కల్పిస్తుంది అన్నారు . తెలంగాణ ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ కాబట్టి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చుకుంటే ప్రజల జీవితాలు మారుతాయి అన్నారు . 1969 నుండి తెలంగాణ ఉద్యమ చరిత్రలో జరిగిన పరిణామలను కళ్ళకు కట్టినట్టుగా వివరించారు . ఎన్నో అక్రమాలకు , అవినీతిలకు ఈ ప్రభుత్వం పెద్ద పీఠ వేసిందన్నారు.
ఇది కూడా చదవండి:- కేసిఆర్ ని ఓడించి పామ్ హౌస్ కే పరిమితం చేయాలి: కే.వీ.కృష్ణారావు
బిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో పోలీసులు రాజ్యం ఏళుతున్నట్టుగా కనబడుతుందని , కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి , కనీస ప్రమాణాలు పాటించకుండా కేవలం ధనార్జనే ద్యేయంగా వారి గిన్నిస్ బుక్ రికార్డుల కోసం తక్కువ సమయంలో నిర్మించారని అన్నారు . దానివల్లనే మొన్న మేడిగడ్డ వద్ద కుంగిపోయినది . ప్రవళిక అనే ఒక నిరుద్యోగి ఈ ప్రభుత్వ అరాచకాలను చూసి పరీక్షల నిర్వహణలో కనబడుతున్న డొల్లతనం చూసి చలించి పోయి ఇక నాకు ఉద్యోగం రాదని తీవ్ర మనస్థాపానికి గురై తనకు తాను ఆత్మహత్య చేసుకుంటే దానిని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రేమవ్యవహారాన్ని అంటగట్టి ఆమె పై మచ్చ వేసి రాజకీయంగా వాడుకుని పబ్బం గడుపుతున్నదన్నారు . ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ , మట్టి గుట్టలను తొవ్వుతూ అక్రమ భూ కబ్జాలకు పాల్పడుతూ దారుణమైన అరాచక పరిపాలన కొనసాగిస్తుంది ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం . కేసీఆర్ వాస్తు పిచ్చితో ఉన్న సచివాలయాన్ని తన అధికార బలంతో కూలగొట్టి ఉన్న రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నించడం అవివేకం అన్నారు . ఈ ఆత్మీయ సమ్మేళనంలో నికార్సైన
ఉద్యమకారులు సుమారుగా 600 మంది పాల్గొని విజయవంతం చేశారు .
ఇది కూడా చదవండి:- తుమ్మల అసక్తికర వ్యాఖ్యలు..ఏమన్నారంటే..?
ఈ కార్యక్రమంలో ఎర్నేని రామారావు, గోపగాని శంకర్రావు, అర్వపల్లి విద్యాసాగర్, అర్వపల్లి సుధాకర్, గుంతేటీ వీరభద్రం, డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్, పద్మాచారి, సురేందర్ రెడ్డి , జ్యోతి రెడ్డి , గొట్టిముక్కల శ్రీనివాస్ , షేక్ మస్తాన్ , కాంతేశ్వరరావు , భసాట హనుమంతరావు , భుక్య శ్రీనివాస్ నాయక్ , భుక్య రాంబాబు నాయక్ , భట్ట రాజేంద్ర విజయ్ , మల్లెల రామనాథం , ఐలయ్య , నారాయణ సింగ్ , దాసరి శ్రీనివాస్ , బోడ రమేష్ నాయక్ , చావ రమేష్ నాయక్ , అజ్మీర శివ నాయక్ , నాగరాజు తదితరులు పాల్గొన్నారు .