Telugu News

ఖమ్మం లో నేడు కాంగ్రెస్ బైక్ ర్యాలీ 

హాజరుకానున్న మంత్రులు పొంగులేటి, తుమ్మల, డీసీసీ*

0

ఖమ్మం లో నేడు కాంగ్రెస్ బైక్ ర్యాలీ 

== ఆర్ఆర్ఆర్ విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం వైరా రోడ్డులో బైక్ ర్యాలీ*

== హాజరుకానున్న మంత్రులు పొంగులేటి, తుమ్మల, డీసీసీ*

(ఖమ్మం-విజయం న్యూస్):

సీపీఐ, సీపీఎం, టీజేఎస్, టీడీపీ పార్టీలు బలపరిచిన ఖమ్మం
పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో ఈనెల 11వ తేదీన శనివారం ఉదయం 10.00 గంటల నుంచి బైక్ ర్యాలీ జరగనుంది. ఈమేరకు టూర్
ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర అధ్యక్షులు జావేద్ పాల్గొననున్న ఈ ర్యాలీ స్థానిక ఎస్ఆర్ అండ్ బిజిఎన్ఆర్ కళాశాల నుంచి ఇల్లందు క్రాస్ రోడ్, విఆర్ కే సిల్క్స్, మమతా రోడ్, చెరువు బజార్, చర్చికాంపౌండ్,
శ్రీనివాస నగర్, గ్రెయిన్ మార్కెట్, పీఎస్ఆర్ రోడ్, కాల్వొడ్డు, మయూరి సెంటర్, బస్ డిపో, రాపర్తినగర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు. కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, టీడీపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
అధిక సంఖ్యలో హాజరు కావాలని దయాకర్ రెడ్డి కోరారు.