Telugu News

రైతులను కలిసిన కాంగ్రెస్ అభ్యర్థి

రైతు సమస్యలను పరిష్కరిస్తానన్న రఘురాం రెడ్డి 

0

రైతులను కలిసిన కాంగ్రెస్ అభ్యర్థి

== రైతు సమస్యలను పరిష్కరిస్తానన్న రఘురాం రెడ్డి 

== పొంగులేటి ప్రసాద్ రెడ్డితో కలిసి రఘురాం రెడ్డి ప్రచారం

== ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఓట్ల అభ్యర్థన
== కదిలొచ్చిన వామపక్ష నాయకులు

(ఖమ్మం-విజయం న్యూస్):

సీపీఐ, సీపీఎం బలపర్చిన ఖమ్మం లోక్ సభ ఎంపీ 7అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తో కలిసి సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డు లో ప్రచారం చేశారు. అక్కడ హమాలీలు, వ్యాపారులు, రైతులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు వెన్నంటి ఉండి..యార్డు మొత్తం తిప్పారు.
ఈ సందర్భంగా
*రఘురాం రెడ్డి మాట్లాడుతూ..* అందరికీ అందుబాటులో ఉండి, పాలన సాగిస్తానని తెలిపారు.
*పొంగులేటి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..* భారీ మెజారిటీ అందించి..విజయ ఢంకా మొగిద్దామని అన్నారు.
*కామ్రేడ్లమంతా మీ వెంటే..* అని సీపీఎం సీనియర్ నాయకులు యర్రా శ్రీకాంత్ కోరారు.
*పెవిలియన్ గ్రౌండ్ లో..* రామ సహాయం రఘు రాం రెడ్డి సోమవారం ఉదయం వాకర్లతో మాట్లాడారు. హస్తం గుర్తుపై ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మనుకొండ రాధా కిషోర్, నాయకులు జొన్నలగడ్డ రవి, దీపక్ చౌదరి, ఎండీ.ముస్తఫా, జ్యోతిర్మయి, పట్టాభి తదితరులు పాల్గొన్నారు.