Telugu News

కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమైంది: పొంగులేటి 

కారేపల్లి, మంచుకొండ లో మంత్రి పొంగులేటి, రఘురాం రెడ్డి ముమ్మర ప్రచారం*

0

కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమైంది: పొంగులేటి 

== కారేపల్లి, మంచుకొండ లో మంత్రి పొంగులేటి, రఘురాం రెడ్డి ముమ్మర ప్రచారం*
(కారేపల్లి/రఘునాధపాలెం-విజయం న్యూస్):
సీపీఐ, సీపీఎం బలపరిచిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి భారీ విజయాన్ని కాంక్షిస్తూ ఆయనతో కలిసి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం రాత్రి కారేపల్లి, మంచుకొండ లో విస్తృత ప్రచారం చేశారు. ప్రజా సంక్షేమ పాలన కోసం హస్తం గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలపై అధిక ధరల భారం మోపిందని, సామాన్యుడు బతకలేని దుస్థితిని తీసుకొచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే రోజులు పోయాయని తెలిపారు. ఈ సందర్భంగా రెండు చోట్లా జనం విశేషంగా తరలివచ్చి.. ప్రదర్శన తీశారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కాంగ్రెస్ నాయకులు బొర్రా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.