Telugu News

కాంగ్రెస్ 420హామీలు ఇచ్చి మోసం చేసింది: పువ్వాడ

కూలీలను కలిసిన మాజీ మంత్రి

0

కాంగ్రెస్ 420హామీలు ఇచ్చి మోసం చేసింది: పువ్వాడ

== కూలీలను కలిసిన మాజీ మంత్రి

(ఖమ్మం -విజయం న్యూస్)

ఖమ్మం BRS పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వర రావు గారి గెలుపును కాంక్షిస్తూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు రఘునాదపాలెం మండలం లోని కేసీఆర్ నగర్ వద్ద కరువు పని కూలీలకు కలిసి ఓట్లు అభ్యర్థించారు.

కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చిందే తప్ప దాన్ని ఆచరణ సాధ్యం చేయట్లేదన్నారు.

రైతు బంధు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు.. ఇచ్చారా.. కళ్యాణ లక్ష్మీ లో తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చారా..? రుణ మాఫీ చేస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పాడు ఏమైంది మీరిచ్చిన హామీ.. ఎందుకు చేయలేదో ప్రశ్నించాలి.

రేవంత్ రెడ్డి చెప్పినట్లు గా రైతులు బ్యాంక్ లో రూ. రెండు లక్షలు రుణం తీసుకుని ఉంటే రైతుల పరిస్థితి ఏమయ్యేది..

కాంగ్రెస్ ప్రభుత్వంవి మోసపూరిత వాగ్దానాలే తప్ప ప్రజలు సంక్షేమం పంచాలనే ఉద్దేశం లేదన్నారు.

వారు ఇచ్చిన ప్రతి వాగ్ధానం ను పట్టుబట్టి అమలు చేయించే బాధ్యత BRS తీసుకుంటుంది అని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో BRS అభ్యర్ధి నామా నాగేశ్వర రావు ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.