Telugu News

రైతులను మోసం చేసింది కాంగ్రెస్: నామా

వ్యవసాయ పంటలకు మద్ధతు ధర తీసుకువస్తాం...

0

రైతులను మోసం చేసింది కాంగ్రెస్: నామా

== వ్యవసాయ పంటలకు మద్ధతు ధర తీసుకువస్తాం…
== ఖమ్మం మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

రైతులు పండించిన ప్రతీ పంటకు మద్ధతు ధర ఇవ్వటానికి చట్టం తీసుకురావాలని తాను పార్లమెంటులో డిమాండ్ చేశానని సిట్టింగ్ ఎంపీ అయిన నామ నాగేశ్వరరావు చెప్పారు. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి రైతులతో మాట్లాడారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని రైతులకు మద్ధతు ధర ఇవ్వాలని పార్లమెంటులో పోరాడానని రైతులకు నామ వివరించారు. ‘‘చట్టాలుంటే రైతులకు మద్ధతు ధరపై హక్కు ఉంటుంది. డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయకుండా కేంద్రం మొండివైఖరి అవలంభించడం వల్ల రైతులకు తీరని నష్టం జరుగుతుందని నామ చెప్పారు.

== కాంగ్రెస్ కరవు తీసుకువచ్చింది…

కాంగ్రెస్ తెచ్చిన కరవు వల్ల పంటలు దెబ్బతిన్నాయని రైతులు తీవ్రంగా నష్టపోయారని నామ నాగేశ్వరరావు చెప్పారు. రైతు సమస్యలు పరిష్కరించాలంటే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఉండాలని అన్నారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం లో గులాబీ జెండా ఎగరడం ఖాయం: నామా

‘‘రైతుల సమస్యలపై బీజేపీ, కాంగ్రెస్ ఏమీ మాట్లాడరు, వడ్లు కొనాలని మాట్లాడాలని మేం డిమాండ్ చేశాం. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ రైతుల గొంతుక వినిపిస్తాం, రైతుబంధు ఫ్రీ కరెంటు, తెలంగాణ రైతు బిడ్డకు రైతుకు అండగా ఉంటాం. మద్ధతుధరకు చట్టబ్దధత తీసుకువస్తాం’’అని నామ నాగేశ్వరరావు వివరించారు.

== మీరే రావాలి అన్న రైతులు

కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని పలువురు రైతులు చెప్పారు. కేసీఆర్ హయాంలో ఎండాకాలంలో సాగు నీరు అందిందని, రైతుబంధు ఆగలేదని రైతులు పేర్కొన్నారు.అందుకే రైతుల సంక్షేమం కోసం ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో మీరే రావాలి అని రైతులు ముక్తకంఠంతో చెప్పారు.

== రైతులతో మాట్లాడిన నామ

పెట్టుబడి ఎంత అయిందని, గిట్టుబాటు ధర వస్తుందా అని నామ రైతులను ప్రశ్నించారు. గిట్టుబాటు ధర రావడం లేదు. మేమే నష్టపోతున్నాం 300రూపాయల కూలీ అయిందని రైతులు ఆవేదనగా చెప్పారు. వైరస్ వల్ల దిగుబడి తగ్గింది. రవాణ ఖర్చుల భారం పడుతోందని రైతులు నామకు చెప్పారు. తాము మార్కెట్ అభివృద్ధి చేసి రైతులకు, హమాలీలకు సౌకర్యాలు కల్పించామని నామ గుర్తు చేశారు.

== రైతుల కష్టాలు విన్నాను…

మిర్చికి ఖమ్మం నంబర్ వన్ మార్కెట్ అని తాను రైతుల బాధలు విన్నానని నామ చెప్పారు. పెట్టుబడి పెరిగిందని, మద్దతు రేటు రాలేదని, పురుగుమందుల ధరలు పెరిగాయని రైతులు చెప్పారు.

ఇది కూడా చదవండి:- ఓట్ల కోసమే కాంగ్రెస్ వాగ్దానాలు: నామా 

కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని నామ చెప్పారు. ‘‘వరి చాలా దిక్కులా దెబ్బతింది, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాం, రైతుబంధు ఇవ్వలేదు, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు, హామీల హామీలు ఇచ్చి ఓట్ల కోసం మోసపుచ్చారు.’’ అని నామ వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమం లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, మాటేటి నాగేశ్వరరావు, చిన్ని కృష్ణారావు, సతీష్, నరేష్, మెంతుల శ్రీశైలం, కోలేటి నవీన్, గునుగుంట్ల వాసు, తాళ్లూరి శ్రీనివాస్, చీకటి రాంబాబు, కృష్ణప్రసాద్ తదితరులు ఉన్నారు