Telugu News

పుట్టినరోజు వేడుకల్లో బయటపడ్డ కాంగ్రెస్ వర్గ పోరు……..

ఏమి జరుగుతుందో అర్థం కాని కార్యకర్తలు......

0

పుట్టినరోజు వేడుకల్లో బయటపడ్డ కాంగ్రెస్ వర్గ పోరు……..
ఏమి జరుగుతుందో అర్థం కాని కార్యకర్తలు……
మండల పార్టీని రెండుగా చీల్చిన జిల్లా నాయకత్వం…….
( చండ్రుగొండ -విజయం న్యూస్ ):-

మండల కాంగ్రెస్ లో వర్గ పోరు మరోసారి బహిర్గతమైంది….. గత కొన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా బయట పడ్డాయి……
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం వీరయ్య పుట్టినరోజు వేడుకలను ఆదివారం గోవిందరెడ్డి… సాబీర్ హుస్సేన్ వర్గాలుగా వేర్వేరుగా నిర్వహించారు.. ప్రధాన సెంటర్లో వేడుకొన్న సాబీర్ వర్గం…. దళిత కాలనీలో గోవిందరెడ్డి వర్గం నిర్వహించాయి….. పార్టీ అధిష్టానం సభ్యత్వ నమోదుకు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సాబీర్ హుస్సేన్ కాదని గుర్రాయి గూడెం గ్రామాలకు చెందిన దారం గోవిందరెడ్డి కి బాధ్యతలు అప్పగించడం… మరో పక్క పార్టీ కమిటీలను మళ్ళీ వేసేలా పార్టీ మండల కాంగ్రెస్ ఇన్చార్జిగా గోవిందరెడ్డిని డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య నియమించడంతో వర్గాలు గా మండలంలో కాంగ్రెస్ పార్టీ విడిపోయింది…

also read :-బండి సంజయ్ దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత

అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీని జిల్లా నాయకత్వం రెండుగా చీల్చిందని మండల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… ఏది ఏమైనా మండల కాంగ్రెస్ లో వర్గ పోరు తో కేడర్లో అయోమయం నెలకొంది… దీనిపై జిల్లా నాయకత్వం స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బహిర్గతంగా చర్చించుకుంటున్నారు…..