Telugu News

అందర్ని కలిసి మాట్లాడతా: భట్టి

పార్టీ నేతలందర్ని ఐక్యం చేస్తా

0

అందర్ని కలిసి మాట్లాడతా: భట్టి

*పార్టీ నేతలందర్ని ఐక్యం చేస్తా

*స్వాతంత్ర పోరాటంలో అడ్రస్ లేని బిజెపి*

*తామే స్వాతంత్య్రం తెచ్చినట్టుగా చరిత్ర వక్రీకరణకు బిజెపి కుట్ర*

*స్వాతంత్య్రం తీసుకొచ్చి నవభారత నిర్మాణం చేసింది కాంగ్రెస్*

*స్వాతంత్య్ర సంగ్రామ సూర్తిని ప్రజల్లో రగిలిస్తాం*

*ఈ నెల 9నుంచి 15 వరకు అన్ని జిల్లాల్లో పాదయాత్రలు*

*ఖ‌మ్మంలో పాలేరు నుంచి స‌త్తుప‌ల్లి వ‌ర‌కు పాద‌యాత్ర‌*

*రూట్ మ్యాప్‌ను విడుద‌ల చేసిన సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌*
ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 7(విజయంన్యూస్)

స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఒక పేజీ కూడ లేని బిజెపి తామే స్వాతంత్య్రం తీసుకువచ్చామన్నట్టుగా ప్రచార ఆర్భాటానికి తెర లేపడం విడ్డూరంగా ఉందని *సీఎల్పీ నేత భట్టి విక్రమార్క* విమర్శించారు. మహాత్మ గాంధి నేతృత్వంలో దేశ స్వాతత్య్రం కోసం పోరాడిన సర్దార్ వల్లాబాయి పటేల్ పేరును వాడుకుంటూ బిజెపి చరిత్రను వక్రీకరించే కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రజా భవన్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు.

Allso read:- ఆయన దారేటు..?

1885 నుంచి 1947 వరకు జరిగిన స్వాతంత్య్ర సంగ్రామంలో ఆనేక ఉద్యమాలను కాంగ్రెస్ నిర్వహించిందని, ఈ ఉద్యమాల్లో బిజెపి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ 75వ స్వాతంత్య్ర ఉత్సవాలను ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణలో ఈనెల 9 నుంచి 15వరకు అన్ని జిల్లాల్లో 75 కిలోమీటర్లకు పైగా పాదయాత్రలు చేసి, ఆనాటి స్వాతంత్ర సంగ్రామ చరిత్రను, ఉద్యమ ఘట్టాలను, ఆనాటీ మహానీయుల పోరాటా గాధలను ప్రజలకు వివరించనున్నట్టు వెల్లడించారు. ఐఏసిసి పిలుపులో భాగంగా నిర్వ‌హించే ఈ పాదయాత్రలో కాంగ్రెస్ శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎఐసిసి నాయకులు, పిసిసి నాయకులు తప్పని సరిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. 1885 మొదలుకొని 1947 వరకు జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో ఉప్పు సత్యగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండయా తదితర ఉద్యమాలను నడిపి బ్రిటీష్ పాలకులను పారద్రోలి దేశానికి కాంగ్రెస్ స్వాతంత్య్రం తీసుకువచ్చిందన్నారు. లాల లజపతిరాయ్, బాల గంగధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, గోపాలకృష్ణ గోకూలే, మహాత్మగాంధి, మోతిలాల్ నెహ్రు, చిత్తరంజన్ తెలుగు రాష్ట్రాల నుంచి పింగళి వెంకయ్య, ఖమ్మం నుంచి కేశవరావు, పట్టాభి సీతరామయ్య లాంటి ఆనేక మంది కాంగ్రెస్‌ పోరాట యోధులు చేసిన ఉద్యమాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్ర ఫలాలు అని వివరించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లే విధంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తో అద్బుతమైన రాజ్యాంగాన్ని రూపోందించి దేశానికి కాంగ్రెస్ అందించిందన్నారు. నవభారత నిర్మాణం చేయడం కోసం కాంగ్రెస్ పంచవర్ష ప్రణాళికలు, 20 సూత్రలు, మిశ్రమ ఆర్ధిక విధానాలు, హరిత విప్లవం, బ్యాంకుల జాతీయకరణ, భూ సంస్కరణలు తీసుకురావడంతో పాటు దేశంలో గరీబీ హఠావో అనే పెద్ద నినాదం తీసుకువచ్చి దేశ అభివృద్ధికి కాంగ్రెస్ బాటాలు వేసిందన్నారు. నవ భారత నిర్మాణాన్ని కండ్లముందే నేడు బిజెపి ద్వంసం చేస్తున్నదని మండిపడ్డారు. బిజెపి చేస్తున్న ఆకృత్యాలను దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదన్నారు. దేశ భవిష్యత్తును, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పాటు ఆనాడు జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో స్వాతంత్య్ర లక్షాలను ప్రజలకు చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన పత్రికలు నేడు అదే విధంగా ముఖ్య భూమిక పోషించాలని కోరారు. ప్రతి జిల్లాలో నిర్వహించే పాదయాత్రలో ఆనాటి స్వాతంత్ర సంగ్రామ ఘాట్టాలను చాటి చెప్తూనే.. నేడు దేశ వినాశనానికి బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి స్వాతంత్య్ర సంగ్రామ సూర్తిని ప్రజల్లో రగిలిస్తామన్నారు.

Allso read:- కాంగ్రెస్ లో చేరిన పాలేరు నియోజకవర్గ నేత ఎవరు..?

*పాలేరు నుంచి పాదయాత్ర*
75వ స్వాతంత్ర ఉత్స‌వాల సంద‌ర్భంగా ఖ‌మ్మం జిల్లాలోని పాలేరు, ఖ‌మ్మం, వైరా, స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ నెల 09 నుంచి15 వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. 9న పాలేరు నుంచి ప్రారంభ‌య్యే పాద‌యాత్ర‌కు తాను హాజ‌ర‌వుతున్నట్టు ప్ర‌క‌టించారు. 15న స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర ముగుస్తుంద‌ని తెలిపారు. 7రోజుల పాటు జ‌రిగే పాద‌యాత్ర‌కు డిసిసి ఆధ్వ‌ర్యంలో విస్త్ర‌తంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని వివ‌రించారు. పాద‌యాత్ర సంద‌ర్భంగా ఆనాటి స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న‌టువంటి స్వాతంత్ర స‌మ‌ర యోధుల‌కు స‌న్మాణం చేయ‌నున్న‌ట్టు చెప్పారు. ఈ మీడియా స‌మ‌వేశంలో డిసిసి అధ్య‌క్షులు పువ్వాళ్ల దుర్గ ప్ర‌సాద్‌, నాయ‌కులు రాయ‌ల నాగేశ్వ‌ర్‌రావు, వీర‌భ‌ద్రం త‌దిత‌రులు పాల్గొన్నారు.