Telugu News

బీఆర్ఎస్ పోస్ట్ కార్డు ఉద్యమం.. ఎందుకోసమంటే..? 

హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్ఎస్*

0

ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం: పువ్వాడ 

==  హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్ఎస్*

== పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంబించిన ఎంపీ వద్దిరాజు,  పార్లమెంట్ అభ్యర్థి నామా, మాజీ మంత్రి పువ్వాడ,ఎమ్మెల్సీ తాతా మధు..

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షల రూపాయల రైతు రుణమాఫీ, రైతుబంధు రూ.15వేలకు, పింఛన్ రూ.4వేలకు పెంచుతామని, వరి క్వింటాలుకు రూ.500 రూపాయలు బోనస్ గా చెల్లిస్తామన్న కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి:- మంత్రి తుమ్మల పై దాడికి కుట్ర..?

పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం తెలంగాణ భవన్ లో శనివారం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, BRS పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఎమ్మెల్సీ తాతా మధు గారు, పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మెర రాంమూర్తి తదితరులతో కలిసి పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రదర్శించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు “జై తెలంగాణ.. జైజై తెలంగాణ.. వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి.. “రైతు రుణమాఫీ, రైతుబంధు రూ.15వేలు, వరి క్వింటాలుకు రూ. 500బోనస్, పింఛన్లను 4వేలకు పెంచుతామన్న హామీలను వెంటనే అమలు పర్చాలంటూ డిమాండ్ చేశారు.