Telugu News

కాంగ్రెస్ తొలి జాబితా విడుదల

55మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

0

కాంగ్రెస్ తొలి జాబితా విడుదల

== 55మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

(న్యూఢిల్లీ -విజయం న్యూస్)

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను ఏఐసీసీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. మొత్తం 55మందితో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల జబితా విడుదలయ్యింది. 55 మందితో కూడిన జాబితాను ఆ పార్టీ అధిష్టానం రిలీజ్ చేసింది.

ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ కు బాలసాని రాజీనామా..

వంద సీట్లలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన స్క్రీనింగ్ కమిటీ.. 72 సీట్లలో అభ్యర్థులపై ఏకాభిప్రాయానికి వచ్చింది. అయితే బీసీల సీట్లను పెంచాలంటూ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో.. ఆ 72 సీట్లలో తొలి జాబితాగా.. 55 స్థానాల్లో అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. 55 మంది అభ్యర్థులను తొలి లిస్ట్‌లో భాగంగా ప్రకటించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్‌ ఉదయం జాబితాను విడుదల చేశారు. ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు తొలి లిస్టులో లేకపోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి:- తుమ్మల అక్కడ నుంచే పోటీ

ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మొదటి జాబితాలోనే చోటు సంపాదించుకున్నారు.మొత్తం 55 మంది అభ్యర్థుల జాబితాతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేశారు. వివాదం లేని స్థానాలను తొలుత ప్రకటించింది. రెండు మూడు రోజుల్లో మిగిలిన స్థానాల అభ్యర్థులను సైతం ఖరారు చేయనుంది. ఫస్ట్ లిస్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్లు ఉండగా.. ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు లేకపోవడం గమనార్హం. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మొదటి జాబితాలోనే చోటు సంపాదించుకున్నారు.

== కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే..

బెల్లంపల్లి (ఎస్సీ) – గడ్డం వినోద్‌

మంచిర్యాల – ప్రేమ్‌సాగర్‌ రావు

నిర్మల్‌ – శ్రీహరి రావు

ఆర్మూర్‌ – ప్రొద్దుటూరి వినయ్‌ కుమార్‌ రెడ్డి

బోధన్‌ – సుదర్శన్‌ రెడ్డి

బాల్కొండ – సునీల్‌ కుమార్‌ ముత్యాల

జగిత్యాల – జీవన్‌ రెడ్డి

ధర్మపురి (ఎస్సీ) – లక్ష్మణ్‌ కుమార్‌

రామగుండం – రాజ్‌ ఠాకూర్‌

మంథని – దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

పెద్దపల్లి – చింతకుంట విజయ్‌ రమణారావు

వేములవాడ – ఆది శ్రీనివాస్‌

మానకొండూరు (ఎస్సీ) – కవ్వంపల్లి సత్యనారాయణ

మెదక్‌ – మైనంపల్లి రోహిత్‌ రావు

అందోల్‌ (ఎస్సీ) – దామోదర రాజనర్సింహ

జహీరాబాద్‌ (ఎస్సీ) – ఆగం చంద్రశేఖర్‌

సంగారెడ్డి – జగ్గారెడ్డి

గజ్వేల్‌ – తూముకుంట నర్సారెడ్డి

మేడ్చల్‌ – తోటకూర వజ్రేశ్‌ యాదవ్‌

మల్కాజిగిరి – మైనంపల్లి హన్మంతరావు

కుత్బుల్లాపూర్ – కొలన్‌ హన్మంత్‌ రెడ్డి

ఉప్పల్‌ – పరమేశ్వర్‌ రెడ్డి

చెవేళ్ల (ఎస్సీ) – భీమ్‌భరత్‌

పరిగి – టి. రామ్మోహన్‌ రెడ్డి

వికారాబాద్‌ – గడ్డం ప్రసాద్‌ కుమార్‌

ముషీరాబాద్‌ – అంజన్‌కుమార్‌ యాదవ్‌

మలక్‌పేట – షేక్‌ అక్బర్‌

సనత్‌నగర్‌ – కోట నీలిమ

నాంపల్లి – ఫిరోజ్‌ ఖాన్‌

కార్వాన్‌ – ఉస్మాన్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌హజ్రి

గోషామహల్‌ – మొగిలి సునీత

చాంద్రయణగుట్ట – బోయ నగేశ్‌ (నరేశ్‌)

యాకత్‌పుర – కె. రవి రాజు

బహదూర్‌పుర – రాజేశ్‌ కుమార్‌ పులిపాటి

సికింద్రాబాద్‌ – ఎ.సంతోష్‌ కుమార్‌

కొడంగల్‌ – రేవంత్‌ రెడ్డి

గద్వాల – సరితా తిరుపతయ్య

అలంపూర్‌ (ఎస్సీ)- సంపత్‌ కుమార్‌

నాగర్‌కర్నూల్‌ – కె. రాజేశ్‌ రెడ్డి

అచ్చంపేట్‌(ఎస్సీ) – సీహెచ్‌ వంశీకృష్ణ

కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణ్‌ రెడ్డి

షాద్‌ నగర్‌ – కె. శంకరయ్య

కొల్లాపూర్‌ – జూపల్లి కృష్ణారావు

నాగార్జున సాగర్‌ – కుందూరు జయవీర్‌

హుజూర్‌ నగర్‌ – ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

కోదాడ – పద్మావతి రెడ్డి

నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నకిరేకల్‌ (ఎస్సీ)- వేముల వీరేశం

ఆలేరు – బీర్ల ఐలయ్య

స్టేషన్‌ ఘన్‌పూర్‌ (ఎస్సీ) – సింగాపురం ఇందిర

నర్సంపేట – దొంతి మాధవ్‌ రెడ్డి

భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ రావు

ములుగు (ఎస్టీ) – సీతక్క

మధిర (ఎస్సీ)- మల్లు భట్టి విక్రమార్క

భద్రాచలం – పొదెం వీరయ్య