Telugu News

దళిత,గిరిజనులకు అండగా కాంగ్రెస్ జెండా: భట్టి

తెలంగాణలో రాచరిక వ్యవస్థ కొనసాగుతుంది

0

దళిత,గిరిజనులకు అండగా కాంగ్రెస్ జెండా: భట్టి

== తెలంగాణలో రాచరిక వ్యవస్థ కొనసాగుతుంది

== నేటికి దళిత,గిరిజనులపై దాడులు జరుగుతున్నాయి

== దళిత, గిరిజనులపై దాడులను సహించేది లేదు

== దలిత గిరిజన ఆత్మగౌరవ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా దలిత, గిరిజనులపై దాడులు, అవమానాలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం

నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభను నిర్వహించగా,  సమావేశానికి అతిథులుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరైయ్యారు. ఈసందర్భంగా మధిర శాసనసభ్యులు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం రాచరిక వ్యవస్థలో లేదు సంపూర్ణ ప్రజాస్వామ్యంలో ఉందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలని సూచించారు. ఆపార రాజకీయ అనుభవం కలిగిన, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి మార్కండేయ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న క్రమంలో ఆయన వెంట వెళ్ళిన గిరిజనుడు వాల్య నాయక్, దలిత నాయకుడు రాములు ను కింద పడవేసి మెడపై కాలు వేసి తొక్కిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మా జెండా మోస్తే చాలు…

ఇది కూడా చదవండి: పొంగులేటి కాంగ్రెస్ కు రండీ..:భట్టి

ఎవరినైన చంపుకోండి.. అని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతోనే ఆ పార్టీ నాయకులు ఈ దుశ్చర్యకు ఒడిగట్టారని, ప్రభుత్వం అండ చూసుకుని ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఆగడాలు పేట్రేగిపోతోన్నాయి. ఇంకా వీటిని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రజల సమస్యల్ని అడిగిన దలిత, గిరిజన కార్యకర్తల గొంతుపై కాలు మోపిన దుర్మార్గాన్ని, దుశ్చర్యని తెలంగాణ సభ్య సమాజం చూస్తూ ఊరుకోదని చెప్పడానికే బిజినేపల్లి వచ్చామని, గిరిజనుడు వాల్య నాయక్, దలిత నాయకులు రాములు పై జరిగిన దాడి వారి పైన జరిగిన దాడిగా భావించడం లేదు. ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాట సమస్యగా భావిస్తున్నామని తెలిపారు. మాజీ పిసిసి అధ్యక్షులు మల్లు అనంత రాములు లాంటి పెద్ద నాయకులు ఈ పార్లమెంటుకు  ప్రాతినిధ్యం వహించి, సామాజిక న్యాయం కావాలని తిరుగాడిన గడ్డపై న దలితులపై జరిగిన దాడిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దలిత, గిరిజనులపై ఇలాంటి దాడులు జరుగుతుంటే ఇంకా చూస్తు ఊరుకోమన్నారు.

దలిత, గిరిజనులపై దాడులు చేసిన వారిని వదిలి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రాజెక్టు కట్టాలని సర్కార్ ను నిలదీసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి పై పోలీసులు మహిళను తిట్టాడన్న నెపం మోపి అక్రమంగా కేసులు పెట్టడం అన్యాయని ఖండించారు. పోలీసులు ప్రజలను సంరక్షించడానికి ఉద్యోగాలు చేయాలి కానీ, అధికార పార్టీ చెప్పు చేతుల్లో పని చేయడానికి కాదు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. చట్ట ప్రకారంగా పని చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నానని భట్టి విక్రమార్క పోలీసులకు విజ్జప్తి చేశారు.

ఇది కూడ చదవండి: బీఆర్ఎస్ కు కోరం గుడ్ బై..?

చట్ట ప్రకారంగా పని చేయకుండా ప్రభుత్వానికి తొత్తులుగా మారి అక్రమంగా కేసులు పెట్టి ఇలాగే చేస్తామని  చెప్పడం పోలీసు శాఖకి మాయని మచ్చ తేవడమే. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్న ధర్మంగా పాలన చేయాలి. న్యాయంగా ఉండాలి. చట్టం ప్రకారం నడవాలి. భిన్నంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. బీహార్లో దళితులపై ఊచకోత జరిగినప్పుడు స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ అక్కడికి వెళ్లి నేనున్నానని ధైర్యం చెప్పింది. అదే స్ఫూర్తితో తెలంగాణలో దళితులకు, గిరిజనులకు ఎక్కడ అవమానాలు జరిగిన, అన్యాయం జరిగిన కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, దళిత గిరిజనులకు అండగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము ఉన్నామని భరోసా కల్పించారు.