*కష్టపడ్డవారికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుంది
*పాలేరు లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం..*
*బిఆర్ఎస్ ఆడే మైండ్ గేమ్ లో పడొద్దు..*
*మీడియా తో ఇష్టాగోష్టిగా మాట్లాడిన టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు*
(నేలకొండపల్లి -విజయం న్యూస్)
✍️ పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని *టిపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు * పేర్కొన్నారు. గురువారం నేలకొండపల్లి గ్రామంలో నియోజకవర్గ సోషల్ మీడియా కో.కో.ఆర్టినేటర్ పగిడికత్తుల సుదర్శన్ ఇంటి వద్ద మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. త్వరలో తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బిఆర్ఎస్ నియంతృత్వ పోకడలు అవలంబిస్తుందన్నారు.
ఇది కూడా చదవండి:- కలిసిన ‘తుమ్మల, రాయల’.ఏం జరిగిందంటే..?
రాహుల్ గాంధీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీ ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తుపై ఎవరు పోటీ చేసినా గెలుపే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు. బిఆర్ఎస్ ఆడే మైండ్ గేమ్ లో నాయకులు, కార్యకర్తలు పడొద్దని హెచ్చరించారు….
ఇది కూడా చదవండి:- ఖమ్మం నగరంలో కాంగ్రెస్ భారీ ప్రదర్శన